అనసూయను ఇరిటేట్ చేసిన ట్విట్టర్

August 06, 2020

ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయకు సోషల్ మీడియాలో వేధింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయట. తనపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. తనపై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె ట్వీట్ కంప్లైంట్ చేసింది.
ఆన్ లైన్ లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇందుకు వ్యవస్థలు స్పందించాలంటూ ఆమె ట్వీట్ రిక్వెస్ట్ చేశారు. తనపై అంతకంతకూ పెరుగుతున్న అసభ్య వ్యాఖ్యలకు స్పందించకుంటే సహనానికి అర్థం ఉండదన్నారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు తానేమీ సిగ్గు పడటం లేదన్న ఆమె.. చట్టం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. దీనికి సంబంధించి ఆమె చేసిన ట్వీట్ కు హైదరాబాద్ సైబర్ పోలీసులు స్పందించారు. ఆమెను సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన ట్వీట్ రిక్వెస్టుకు పోలీసులు స్పందించిన వైనానికి ఆమె సంతోషాన్ని వ్యక్తం చేయటంతో పాటు థ్యాంక్స్ చెప్పారు.