నాగబాబుకు కామెడీ షో కష్టాలు

August 06, 2020

నాగబాబు... తన జీవితం మొత్తంలో సాధించిన పేరుకంటే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో వల్ల పొందిన గుర్తింపే ఎక్కువ. ఆ షో పుణ్యమా అని అతను తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయ్యారు. చాలా సార్లు తనే ఈ విషయాన్ని ఇంకో రకంగా చెప్పేవారు. 

తాను ఆర్థికంగా నిల‌దొక్కుకున్నాన‌ని అంటే దానికి జబర్దస్తే కారణమని అనేవారు. అయితే సుదీర్ఘకాలం తర్వాత ఆ షో నుంచి తప్పుకున్నారు. అయితే షో నుంచి వెళ్లేటపుడు నిర్వాహ‌కుల‌పై అనేక ఆరోప‌ణ‌లు చేశారు. ఇది జబర్దస్త్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొంద‌రు పార్టిసిపెంట్ల‌ను అన్యాయంగా షో నుంచి తొల‌గించార‌ని, పార్టిసిపెంట్ల‌ను యాజ‌మాన్యం ప‌ట్టించుకునేది కాదని అన్నారు. ఇంకా బోలెడు ఆరోపనలు చేశారు. ఇది పాత స్టోరీ.

తాజాగా జబర్దస్త్ కు పోటీ గా మొదలైన ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ పై పగతో మొదలుపెట్టిన అదిరింది కామెడీ షోకు కర్త కర్మ నాగబాబే. ఈ షోలో యాంక‌ర్ స‌మీరా షేక్‌ కేవలం పది ఎపిసోడ్లతోనే ఎసరు పెట్టేశారు. 26 ఎపిసోడ్లకు అగ్రిమెంట్ చేసుకుని పది ఎపిసోడ్లకే తీసేశారట. కనీసం ఆమెకు సమాచారం లేదట. ప్రస్తుతం ఈ షోను ర‌వి, భానుల‌కు అప్పగించారు. త‌న‌ను త‌ప్పించిన విష‌యం ఆమెకు మీడియా ద్వారా తెలియడం హైలైట్.  

షో నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వార్తలు వస్తు్నాయని... నిర్వాహ‌కులే తనను త‌ప్పించార‌ని స‌మీరా తాజాగా వెల్లడించింది. త‌నింకా గ్లామర్ గా కనిపించాలని నిర్వాహ‌కులు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. త‌న కంఫ‌ర్ట్ మేర‌కు తాను షోలో క‌నిపించాన‌ని.. ఎవరినో ఫాలో అవ్వలేనని, అవ్వలేదని అన్నారు . మరి ఆమెకు జరిగిన అన్యాయానికి నాగబాబు ఏమంటారు. ఆరోజు జ‌బ‌ర్ద‌స్త్‌ పై పడిన నాగబాబు ఈరోజు అదిరింది షో యాజమాన్యాన్ని నిలదీస్తారా?