ఆంధ్రోళ్లను దెబ్బేయటంలో అరవోళ్ల లెక్కే వేరయా?

July 07, 2020

సౌత్ అన్నంతనే అరవోళ్లు గుర్తుకు వస్తారు. మీదే ప్రాంతం అన్న ప్రశ్నకు సమాధానంగా మద్రాసీనా? అనే ఉత్తరాది వారి మాటలు ఇప్పటికి వినిపిస్తుంటుంది. కాస్తంత ఎటకారంగా మాట్లాడాలంటే సాంబారా? అంటూ వ్యాఖ్యానించటం ఉత్తరాది రాష్ట్రాల వారి మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే దరిద్రమో కానీ.. తెలుగోళ్లకు ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ.. అరవోళ్ల నీడలో నుంచి బయటకు రాలేని దుస్థితి.
తెలుగోళ్లకు.. అందునా ఆంధ్రోళ్లకు దెబ్బ పడే ప్రతిసారీ అరవోళ్లు ఎవరో ఒకరు కీలక భూమిక పోషించటం అనుకోకుండా జరిగేదా? లేక.. అలా జరగటంలో వేరే లెక్క ఉందా? అన్నది అర్థం కానిదిగా ఉంటుంది. తాజాగా ఉదంతం దీనికి మరో నిదర్శనంగా చెప్పక తప్పదు. దేశంలోని 27 ప్రభుత్వ బ్యాంకుల్ని 12కు కుదిస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను స్టేట్ భ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేసి.. తెలుగోళ్ల ఉనికిని మాయం చేసిన కేంద్రం నిర్ణయం తెలుగువారిని ఒకసారి బాధించింది. ఇక.. ఏపీని రెండు ముక్కలుగా చేస్తూ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంలో కీలక భూమిక పోషించిన వారిలో తమిళతంబి చిదంబరం ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
రాష్ట్ర విభజనలో ఆంధ్రోళ్లను చిదంబరం తంబి భలే దెబ్బేశారన్న మాట బలంగా వినిపించింది. అరవోళ్లు ఆంధ్రోళ్లను దెబ్బేసే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టరన్న విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉండేదే. తాజాగా అది మరోసారి నిజమని తేలింది. ఆంధ్రా ప్రాంత వాసుల జీవితాల్లో దగ్గర దగ్గర వందేళ్ల (కచ్ఛితంగా చెప్పాలంటే 96 ఏళ్లు) అనుబంధం ఉన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయాలన్న నిర్ణయం ఒక ఎత్తు అయితే.. ఇందులో కీలకభూమిక పోషించిన వారి విషయానికి వస్తే.. అరవోళ్ల హస్తం ఉండటం గమనార్హం.
తాజాగా ఆంధ్రా బ్యాంకును విలీనం చేయటంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలకభూమిక పోషించారనిచెప్పాలి. తమిళనాడుకు చెందిన ఆమె.. తెలుగింటి కోడలుగా సుపరిచితులు. తన మెట్టినింటి మూలాల్ని కాపాడుకోవాల్సిన దానికి భిన్నంగా వారి మనసుల్ని గాయపరిచేలా నిర్ణయం తీసుకోవటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. విభజనలో చిదంబరం మాష్టారు ఆంధ్రోళ్లను దెబ్బేస్తే.. తాజాగా బ్యాంకుల విలీనంలో ఆంధ్రా బ్యాంకు విలీనంలో అదే తమిళనాడు ప్రాంతానికి చెందిన నిర్మలా సీతారామన్ ఉండటం గమనార్హం.

RELATED ARTICLES

  • No related artciles found