చిరంజీవికి జగన్ గుడ్ న్యూస్

February 24, 2020

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన తెలుగు సినిమా అని, జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తాను మరోసారి చాటుతామని, ప్రభుత్వం అధిక షోలకు అవకాశం కల్పించాలని నిర్మాత రాంచరణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. జగన్ ప్రభుత్వం బెనిఫిట్ షోలను అనుమతించలేదు. కానీ... ఆరు షోలకు మాత్రం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ సినిమా బయ్యర్లకు పెద్ద ఊరట కలిగింది. 

ఇది చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్. 8 సంవత్సరాల నుంచి ఆయన దీనిని ఎలాగైనా చేయాలని తటపటాయిస్తున్నారు. చివరకు బాహుబలి విజయంతో ధైర్యం వచ్చింది. అందుకే ముందుకు వెళ్లారు. జాతీయ స్థాయిలో క్రేజు కోసం ఇందులో ఒక ప్రధాన పాత్రకు అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేసుకున్నారు. బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. నయనతార, తమన్నా ప్రధాన కథానాయికలు. 

ప్రస్తుతం అన్ని చోట్లా సైరా బజ్ నడుస్తోంది. సినిమా విడుదలకు ముందు అనేక కేసులు దీనిని ఇబ్బంది పెట్టినా అవన్నీ దాటుకుని విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. పవన్ ను తీవ్రంగా ఏకిపడేసే సాక్షి పత్రిక ఈ సినిమాకు మీడియా పార్టనర్ కావడం గమనార్హం. అందుకే ఎట్టకేలకు చిరంజీవి కుటుంబం కోరిన రెండు కోరికల్లో ఒకటైనా నెరవేరింది.