​అవును ఏపీ నెం.1

August 05, 2020

జగన్ సారథ్యంలో ఏపీ నెం.1 గా ఎదిగింది. వరుసగా రెండో రోజు భారతదేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ​ఏపీ రికార్డు సృష్టించింది. అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న ఏపీలో కొత్త ఈ ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. ఎప్పట్నుంచో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రను వరుసా రెండోసారి ఏపీ దాటేసింది. గత 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. 65 మరణాలు సంభవించాయి. తాజాా కేసులతో ఏపీలో కేసుల సంఖ్య 1.20 లక్షలకు చేరింది. 

అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676 కేసులు, అనంతపురంలో 1371 కేసులు, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి.  తూర్పుగోదావరిలో అత్యధికంగా 14 మంది చనిపోతే, అనంతపూర్‌లో 8 మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు చనిపోయారు. కేవలం ఈరోజు 2784 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. ఇది కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం పావు వంతు మాత్రమే. మరో పది రోజులు ఇలాగే కేసులుపెరిగితే ఏపీలో బెడ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏపీలో 18,20,009 కరోనా పరీక్షలు చేయగా...  గడిచిన 24 గంటల్లో ఏపీలో 70,584 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. కరోనాను జయించి 55,406 మంది కోలుకోగా.. 1213 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 63,771 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.