2021 లో ఏపీ ప్రజలకు తత్వం బోధపడుతుందా?

August 13, 2020

సాధారణంగా అప్పు మనిసికి అయినా, దేశానికి అయినా ప్రమాదం.

అయితే, ఎట్టి పరిస్థితుల్లోను మనకు రెవెన్యూ వస్తుందనుకున్నపుడు అప్పు తప్పదు. కానీ దానికి ఓ పరిమితి ఉండాలి.

అలాంటి పరిమితిని ఆంధ్రప్రదేశ్ దాటేసింది. 

14వ ఆర్థిక సంఘం తాజా నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రమైనా తన జీఎస్డీపీలో 25 శాతానికి మించి అప్పులు చేయడం ప్రమాదకరం అని నిర్దేశించింది.

దీనిని దాదాపు అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి. కానీ ఏపీ ఈ పరిమితిని దాటేసింది.

ప్రస్తతం ఏపీ జీఎస్ డీపీలో (Andhrapradesh GSDP) ఏపీ అప్పుు 34.6 శాతం ఉంది. అంటే కేంద్ర సంస్థ అనుమతించిన పరిమితికంటే దాదాపు పది శాతం ఎక్కువ.

అప్పులు ఎక్కువుంటే నిజంగా ఏదైనా అవసరం అయినపుడు అప్పులు పుట్టవు.

ఈ ప్రమాదం వల్ల ఎపుడూ రాష్ట్రాలు ఆర్థిక సంఘం సూచనలను ఫాలో అవుతుంటాయి.

తెలంగాణ జీఎస్డీపీలో Telangana GSDP ఆ రాష్ట్ర అప్పు 21.4 శాతం.

అంటే మన  తెలంగాణ కంటే 13 శాతం అధికంగా తన పరిమితిని దాటేసింది.

నిజానికి తెలంగాణకు ఉన్న ఆదాయ వనరులు ఏపీకి లేవు.

తెలంగాణకు అప్పులు భరించి శక్తి ఉంది. కానీ ఏపీకి లేదు.

అయినా తెలంగాణ కంటే ఏపీ ఎక్కువ అప్పులు చేసింది. అప్పులు పెరగడం అంటే అది రాష్ట్ర నాయకత్వం లోపం కింద లెక్క. 

ఎపుడైతే రాష్ట్ర ఆదాయం తక్కువ ఉంటుందో అపుడు అప్పు ఎక్కువ చేయాల్సి వస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో అప్పుల శాతం విపరీతంగా పెరిగింది.

గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసినన్ని అప్పులు జగన్ ప్రభుత్వం ఏడాదిలో చేసేసింది.

కొత్త పరిశ్రమలు రాకపోవడం వల్ల రెవెన్యూ పెరగడం లేదు. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. దీనిని బ్యాలెన్స్ చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రం నడవడమే కష్టం.

ఇది సరే.. మరి చేసిన అప్పులకు వడ్డీ కట్టాలి కదా. మరి ఏపీ సంపాదించే ప్రతి వంద రూపాయల్లో అసలు ఎంత కడుతోంది? వడ్డీ ఎంత కడుతోంది? ఈ అనుమానం మీకు వచ్చిందా? వచ్చే ఉంటుంది.

ప్రతి సంవత్సరం తాను సంపాదించే ఆదాయంలో ఏపీ 22.5 శాతం అసలు, మరో 12.6 శాత వడ్డీకోసం చెల్లిస్తోంది అంటే.... వంద రూపాయలు ఏపీకి ఆదాయం వస్తే అందులో 35 రూపాయలు అప్పులకు పోను మిగిలిన 65 రూపాయలు జీతాలు, పథకాలు, అభివృద్ధి పనుల కోసం వాడాలి. దీన్ని బట్టి ఏపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది కదా. 

అవును ఇపుడు ఎవరికెంత అప్పుంది?

సరైన ప్రశ్న అడిగారు... ఏపీ అప్పు 3.4 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు 1.6 లక్షల కోట్లు.

అంటే తెలంగాణ బడ్జెట్లో 60 శాతంతో తెలంగాణ అప్పంతా తీర్చేయచ్చు.

కానీ ఏపీ అప్పు తీర్చాలంటే రెండు బడ్జెట్లు సరిపోవు. మరి తీరుతుందా. తీర్చేలోపు వడ్డీ పెరిగిపోతుంది.

ఇదేదో నమస్తే ఆంధ్ర రాసిన నోటి లెక్కలు కావు. క్రెడిట్ రేటింగ్స్ అనే సంస్థ బట్టయబలు చేసిన ఏపీ గుట్టు. 

ఇపుడు ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లాల్సి వస్తోంది. అంటే అప్పు పుట్టే ఇతర మార్గాలన్నీ వాడేశాక చివరకు మిగిలిన ఏకైక మార్గమన్నమాట. 

నేడు ప్రభుత్వం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను తెచ్చే స్థితికి వచ్చింది.

రాష్ట్రంపై రుణ భారం ఎంతటి స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.

కొత్త ఆదాయ వనరులు ఏపీకి వచ్చే అవకాశాలు జీరో. ఎందుకంటే రాజకీయ అనిశ్చితి, పాలకుల తీరు వల్ల కొత్త పరిశ్రమలు రావడం లేదు.

దీంతో కొత్త ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి.

ఇదిలాగే కొనసాగితే... రెండేళ్లలో ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా తలెత్తవచ్చు. లేదా అభివృద్ధి పనులు చేయలేని స్థితి రావచ్చు.

ఒకవేళ పాలకుల ఆదాయం పెంచగలిగితే ఆ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. 

ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలు ఏపీకి ఎంత తగ్గితే అంత మేలు.