ఏపీ గురించి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

July 15, 2020

రేవంత్ రెడ్డి... తెలంగాణలో ప్రభావవంతమైన లీడర్లో ఒకరు.  అతని ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా క్రేజున్న వ్యక్తి. తెలంగాణ కాంగ్రెస్ కు కనిపిస్తున్న ఏకైక హోప్. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీ గురించి స్పందించడం చాలా అరుదు. రేవంత్ రెడ్డి కూడా ఎపుడూ ఏపీ గురించి పెద్దగా ప్రస్తావించరు. కానీ ఈరోజు ఏపీ పరిస్థితుల గురించి ఆయన తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. 

ఏపీ పరిస్థితి చూసి ఓ తెలంగాణ పౌరుడిగా సంతో్షిస్తున్నాను. కానీ ఒక భారతీయుడిగా విచారం వ్యక్తంచేస్తున్నాను. ఓ  రియల్టర్ కు లాభం చేకూర్చేందుకు ఏపీని అడ్డంగా వాడుకుంటున్నారు. సోదర రాష్ట్రంలో నేడు తీవ్ర సంక్షోభం నెలకొంది. ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... ఆర్థిక మాంద్యంలో కూడా హైదరాబాదులో రియల్ బూమ్ వచ్చిందంటే అది ఏపీలో పరిస్థితుల వల్లే. ఏపీ తిరోగమనం తెలంగాణకు లాభం చేకూర్చినా... ఏపీ త్వరలో కుప్పకూలే పరిస్థితుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

Read Also

ఎంపీ అరవింద్ బీజేపీ పెద్ద‌ల చేతిలో బుక్క‌య్యాడా?
అమరావతి పోరాటంలో పాల్గొంటా: తెలంగాణ నేత
హైదరాబాద్‌లో ఇరాన్, అమెరికా యుద్ధం మంటలు