జగన్ డేర్... ఆగస్టు 3 నుంచి స్కూళ్లు

June 01, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్... కరోనాలో ప్రతి తొలి అడుగు తానే వేయాలని ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. కరోనాతో సహజీవనం అనే మాట మొదట తానే చెప్పడంతో... అన్ని తనఖాతాలోకే రావాలన్న ఆతృత జగన్ లో బాగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ సీఎంగా పేరు తెచ్చుకోవడానికి ఆయన తహతహలాడుతున్నారు. 

తాజాగా ఏపీలో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభించాలన్న ఆదేశాలను జారీ చేశారు. అంటే మరో రెండున్నర నెలల్లో విజయం సాధిస్తామని ధీమానో, వ్యాక్సిన్ వస్తుందని ఆలోచనో.... అప్పట్లోపు టెస్టులన్నీ చేయగలమన్న నమ్మకమో గాని ఆగస్టు 3 నుంచి స్కూళ్లు మొదలుపెట్టండి అన్న సందేశాలు ఇచ్చారు.

ఒకవేళ అప్పటిలోపు పరిస్థితులు సర్దుకుంటే ఓకే లేకపోతే ఏముందీ అందరితో పాటే మనం అనుకోవచ్చు, లేదంటో నేనే విజేతను అని ప్రకటించుకోవచ్చు. ఆ క్రమంలో తాను స్కూల్స్ పై కీలక ఆదేశాలిచ్చారు జగన్. జులై ముగిసేలోపు పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలని  సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 9 రకాల మౌలిక సదుపాయాలను ప్రతి పాఠశాలలో అభివృద్ధి చేయాలని, వాటిలో ముఖ్యమైవని శౌచాలయాలు అని కలెక్టర్లకు ఆదేశించారు. ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.