ఇక నుంచి ఇంగ్లిష్ ఆంధ్ర

August 07, 2020

ఇకపై 1 నుంచి 8వ తరగతి వరకు బోధన ఇంగ్లిష్ మీడియంలోను ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వీటి కోసం డైట్ (డీఎడ్ విద్యాసంస్థలు) లలో ప్రత్యేక శిక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల కొరత ఇక ఉండబోదని, ప్రతి సంవత్సరం జనవరిలో ఉపాధ్యాయ నోటిఫికేషన్ వేసి ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చూస్తామన్నారు. 70వేల మంది టీచర్లకు ఆంగ్ల శిక్షణ ఇవ్వనున్నారు. 

అన్ని స్కూళ్లను రినోవేట్ చేసి సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలని సూచించారు. దెన్ అండ్ నౌ ప్రోగ్రాం కింద 44512 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిని మొత్తం రినోవేట్ చేయనున్నారు. మొదటి విడతలో 15 వేల స్కూళ్లను రినోవేట్ చేస్తారు.

 కళాశాల కొరత లేకుండా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక ఇంటర్ కళాశాల, ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళశాల కచ్చితంగా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.