నెల్లూరు : ఒక్కరోజులో ఈ పెద్దాయన తెగ పాపులర్ అయ్యాడు

June 04, 2020

సడెన్ గా ఒక పెద్ద మనిషి మార్కెట్లోకి వచ్చాడు. పోలీసులతో ఉన్న మైకు చేతిలోకి తీసుకున్నాడు. పెద్దాయన మర్యాదగా అడిగాడు కదా అని పోలీసులు కూడా మైకు ఇచ్చారు. అంతే పది సెకెండ్లలో అంతా మారిపోయింది.

మార్కెట్లో ఎవరి పని వారు చూసుకుంటూ ఉన్న జనం ఒక్కసారి గా ఆయన మాటలు చెవిలో పడగానే తిరిగి చూశారు. ఆయన ఎంత సేపు చెప్పినా జాగ్రత్తగా విన్నారు. చక్కటి తెలుగు ప్రాసతో కరోనా నుంచి ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆయన చెప్పిన తీరు అదిరిపోయింది. ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ వీడియో చూసేముందు ఆయన ఎవరో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. 

అన్నదాత మణి. ఇది ఆయన పేరు. కావలి పట్టణంలో నివసిస్తారు. సీనియర్ ఎన్టీఆర్ పీఏగా పనిచేశారు. కొంత కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. మంచి వక్త. కావలిలో చాలా ఫేమస్.