అమరావతిలో అంబేద్కర్ అడ్రస్ చెరిపేసిన జగన్

August 05, 2020

Image

రాజధాని అమరావతి సమీపంలోని అయనవోలు గ్రామంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భతమైన అధునాతనమైన విశాలమైన పార్కుకు 2018లో మార్చిలో శంకుస్థాపన చేశారు. పనులు కొనసాగుతున్నాయి. వైకాపా రాగానే దానిని ఆపేశారు. ఎన్టీఆర్ విగ్రహం కంటే కూడా అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకే చంద్రబాబు మొగ్గుచూపారు.

కళ్లు చెదిరే అత్యుత్తమ డిజైన్ తో రూపొందించిన ఈ స్మృతి వనం దేశాన్ని ఆకర్షించింది. దేశ వ్యాప్తంగా ఈ డిజైన్ కి ప్రశంసలు వచ్చాయి. దళితులు తమ నాయకుడు దేశంలోనే అద్భుతమైన విగ్రహ నిర్మాణం అమరావతిలో జరుగుతున్నందుకు ఎంతో సంతోషపడ్డారు.

కట్ చేస్తే తాజాగా రాత్రికి రాత్రి జగన్ ఆ విగ్రహాన్ని విజయవాడకు, పార్కు నిధులను గుంటూరుకు తరలించేశారు. తమ పార్టీ నేతలు ప్రతిపాదించిన చోటకు పార్కుని తరలించారు. కానీ అక్కడ అంబేద్కర్ విగ్రహం ప్రస్తుత ప్రతిపాదనలో అయితే తీసేశారు. బహుశా గొడవలు అవుతాయని ఏదైనా చిన్న అంబేద్కర్ విగ్రహం భవిష్యత్తులో పెడతారేమో గాని ఇప్పటికైతే ఆ ప్లాన్ లేదు.

చంద్రబాబు ఆలోచనే అమరావతిలో కనపడకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఏపీ సర్కార్ అంబేద్కర్ స్మృతివనానికి శఠగోపం పెట్టింది. ఆ ప్రణాళికనే లేపేసింది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇక్కడ ప్రతిపాదించిన విగ్రహాన్ని పీడబ్లుడి గ్రౌండ్, విజయవాడకు తరలిస్తున్నారు. 

అంబేద్కర్ స్మృతివనం తరలింపుపై అమరావతి దళితుల నిరసన తెలిపారు. అంబేద్కర్ స్మృతి వనం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి స్మృతివనం తరలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని దళితులు హెచ్చరించారు.