జగన్ కు ఇక ఏడుపు ఒకటే తక్కువ !!

May 29, 2020

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని పెద్ద షాక్ తగిలింది. సీబీఐ ఇచ్చిన ఈ షాక్ కు జగన్ ఇమేజ్ బాగా డ్యామేజైపోయింది. జగన్ని సీబీఐ కలలో కూడా వెంటాడుతోంది.  సీఎం హోదాలో కొన్ని ప్రత్యేక హక్కులు దక్కుతాయని భావించిన జగన్ కి సీబీఐ కోర్టు తాజా తీర్పు అశనిపాతంలా మారింది.

కొన్ని సంవత్సరాల క్రితం జగన్ పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసుల్లో కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతు జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. ఆ వినతిని కోర్టు తోసిపుచ్చింది. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజా తీర్పుతో ఇటు ఈడీ కేసులు, సీబీఐ కేసుల విచారణకు రెండింటికీ జగన్ వ్యక్తిగతంగా హాజరవకతప్పదు. అంటే...  ఇక నుంచి ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మెట్లెక్కాల్సిందే.

 

ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జిషీట్ల ప్రకారం తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నపుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్టు , ఏకంగా రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాదాయాన్ని కూడబెట్టారని సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా నమోదు చేసిన కేసుల్లో దొరికిన ఆధారాలను తీసుకుని సీబీఐ ఈ ఛార్జి షీట్లను నమోదు చేసింది. ఇపుడు అవి కీలక దశకు వచ్చాయి.  సరిగ్గా ఇదేసమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ కి భారీ మెజార్టీ రావడంతో జగన్ సీఎం సీట్లో కూర్చున్నారు. అయితే, సీఎం హోదాలో ఉన్న తను ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలంటే 60 లక్షలు ఖర్చవుతుందని, విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. ఈ పిటిషన్లను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. సీబీఐ నమోదు కేసుల విషయంలో జగన్ కు వ్యక్తిగత మినహాయింపు కుదరదంటూ గత వారమే సంచలన తీర్పు చెప్పింది. తాజాగా శుక్రవారం ఈడీ కేసుల విషయంలోనూ అదే తీర్పు ఇచ్చింది. దీంతో మొత్తం భారతదేశంలో ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలబడే ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సృష్టించబోతున్నారు.