మీ ఇష్టానుసారం కుదరదు... జగన్ కు మరో పెద్ద షాక్

February 25, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దూకుడుకు హైకోర్టు మరో సారి బ్రేక్ వేసింది.  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ) పున: సమీక్షపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక చీవాట్లు తిన్న జగన్ కు ఇది మరోటి. పీపీఏలపై పున: సమీక్షపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేస్తూ ఏపీ సర్కారు జీవో 63 జారీ చేసింది. దానిని తాజాగా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు, ఈ విద్యుత్ సంస్థలకు కుదించిన టారిఫ్ ప్రకారం తాత్కాలిక చెల్లింపులు వెంటనే చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  
అదే సమయంలో పీఏపీలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు రావాలంటూ కంపెనీలకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు పవన.. సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నట్లుగా జగన్ సర్కారు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఏపీ ఈఆర్సీకి వెళ్లాలని ప్రభుత్వానికి.. పీపీఏలకు హైకోర్టు సూచన చేసింది. ఆర్నెల్ల లోపు వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు సూచన చేసింది. అంతేకాదు.. ఆయా సంస్థల నుంచి వివిధ కారణాలతో విద్యుత్ తీసుకోకుండా నిలిపివేసిన వైనాన్ని సవరించి.. వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని సర్కారుకు హైకోర్టు సూచన చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోలు చేయకుండా ఉండటాన్ని హైకోర్టు తప్పు పట్టి.. వెంటనే కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది.