షాకింగ్ నిజాన్ని చెప్పిన చైనా

August 11, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర వైరస్ కు సంబంధించి షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. దాన్ని వెల్లడించింది కూడా చైనానే కావటం గమనార్హం. ప్రపంచ దేశాల ఉసురు తీస్తున్న ప్రమాదకర వైరస్ కు జన్మస్థలి  చైనా  కావటం.. ఇది ప్రయోగశాలలో పుట్టిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న వేళ.. కొత్త సందేహాలకు తావిచ్చేలా చైనాకు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ స్పందన ఉంది.
ఈ వైరస్ వ్యాపించిన మొదట్లో తాము సేకరించిన నమూనాల్ని నాశనం చేయాలని తామే ఆదేశించామని ఒప్పుకుంది. అప్పటికి సార్స్ కోవ్2ను గుర్తించకపోవటంతో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు.
తాము సేకరించిన వైరస్ నమూనాల్ని అనుమతుల్లేని ప్రయోగశాలల్లోనే ధ్వంసం చేయాలని పేర్కొన్నామని చెబుతున్నారు. అయితే.. అమెరికానే ఈ విషయాన్ని గందరగోళానికి గురయ్యేలా ప్రచారం చేస్తుందని తప్పు పట్టారు.

గతంలో చైనా ఇన్ ఫ్లూయెంజా.. సార్స్ వైరస్ నమూనాల్ని ప్రపంచ దేశాలకు అందించిన వైనాన్ని గుర్తు చేస్తూ.. తమదేమాత్రం తప్పు లేదన్నట్లుగా చైనా సంస్థ తన వాదనను వినిపిస్తోంది. తాజా ఒప్పుకోలు.. చేసిన తప్పును కవర్ చేసుకున్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.