​దేశమంతా జగన్ ని తిడుతుంటే... ఏపీ బీజేపీ ఏం చేస్తోందంటే...

July 12, 2020

​తప్పు, ఒప్పుల గురించి ముందు ఒక్క నిమిషం పక్కన పెడితే... జగన్ తనకు నచ్చినది ఎవరు ఎంత మొత్తుకున్నా సాఫీగా చేసుకు పోతారు. అది మత విస్తరణ కావచ్చు... ఇంకోటి కావచ్చు. ప్రజలు కష్టపడి సంపాదించి కట్టిన డబ్బులను చర్చి పాస్టర్లకు పప్పు బెల్లంలాగా నెలకు ఐదు వేలు పంచిపెడుతుంటే... ఏపీ ప్రజలు చోద్యం చేస్తున్నారు. అధికారికంగా ఇలా ఒక మతానికి సాయం చేయడం అనేది అసలు రాజ్యంగం అలో చేస్తుందా; లేదా కేవలం జగన్ కి మాత్రమే అలో చేస్తుందా అన్న కొత్త అనుమానం రేకెత్తింది అందరికీ. తమది హిందుత్వ పార్టీ. మేమే హిందుత్వను కాపాడేది అని దేశమంతటా చెప్పుకుని తిరిగే బీజేపీ పార్టీ ఏపీలో  ఘోరాలు జరుగుతున్నా కూడా చూస్తూ ఉంటోంది. రెండు రోజుల్లో జగన్ రెండు మతపరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నా కూడా బీజేపీ నోటికి ఎవరో ప్లాస్టరు వేసినట్టే ఉంది. కానీ దేశ ప్రజలు ఊరికే లేరు. #SaveHindusFromJaganReddy అంటూ దేశమంతటా ఒక్కటై గర్జిస్తోంది. జగన్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్ కార్యక్రమాలను ట్రెండింగ్ చేస్తోంది. అలాగే ఏపీలోని దేవాలయాల్లో ఇతర మతస్తులు ఎవరెరు పనిచేస్తున్నదీ ఎత్తిచూపుతోంది.

ఇక ఇటీవల ఏపీలో ఏం జరిందంటే... గుంటూరు జిల్లాలో ఒక దేవాలయాన్ని ప్రభుత్వం కూల్చి వేసింది. ఆ కూల్చివేతకు వాడిన జేసీబీ క్రిస్టియన్ ది కావడం హైలెట్ (ఫొటో కింద స్లైడ్ షోలో ఉంది). దానిపై భారతీయ జనతా పార్టీ గాని, ఆ పార్టీ అధ్యక్షుడు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క ట్వీట్ వేయలేదు. ప్రజల డబ్బుతో క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేసే వారికి రూ.5 వేల రూపాయలు నెలకు ఇవ్వడం అంటే... ఇది రాజరికమో ప్రజాస్వామ్యమో అర్థం కాని పరిస్థితి. జగన్ నా ఆత్మ అని ప్రకటించిన స్వరూపానందేంద్ర సరస్వతి ఒక హిందు మత పీఠాధిపతి. అయినా... స్వంత రాష్ట్రంలో గుడి కూలిస్తే... ఒక్క మాట మాట్లాడలేదు. వ్యతిరేకించలేదు. తప్పు పట్టలేదు.

క దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చిన ఒక సీఎస్ ను పీకేసిన జగన్... ఏకంగా తిరుమల కొండపైనే క్రిస్టియన్లకు ఉద్యోగాలిప్పించారు. ఆ సాక్ష్యాలను కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం రోజు దేశ వ్యాప్తంగా #SaveHindusFromJaganReddy ట్రెండ్ అయ్యిందే... ఏ స్థాయిలో సమాజంలో జగన్ పాలన పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో అర్థమవుతుంది. ఒక అమ్మాయికి జగన్ తన చేతితో అక్షరాభ్యాసం చేయిస్తూ జీసస్ అని రాయించడం ఎక్కువ వైరల్ అవుతోంది. ఎలా చూసినా... తన స్వామిభక్తిని జగన్ బహిరంగంగా చూపుతున్నారు. 

 Image 

 Image