మనకు గుడ్ బై చెబుతున్న అనుపమ పరమేశ్వరన్

August 07, 2020

అందానికి అందం.. అభినయానికి ఏ మాత్రం లోటు లేకపోవటమే కాదు.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే మలయాళి బ్యూటీ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. గ్లామర్ షోపీస్ ముద్రకు దూరంగా ఉంటూ.. అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్ని ఎంచుకునే అనుపమా పరమేశ్వర్ టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిందా? అంటే అవునని చెబుతున్నారు. చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేసిన ఆమె తాజాగా తెలుగు సినిమాలు చేయకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఐదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. శతమానం భవతి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఆమె.. హ్యాట్రిక్ సక్సెస్ తో తిరుగులేని రీతిలో దూసుకెళుతుందని భావించారు. తనకు తాను పాత్రల పరంగా పరిమితులు పెట్టుకున్న అనుపమకు అవకాశాలు లభించలేదు.
మిగిలిన హీరోయిన్ల మాదిరి ఎక్స్ పోజింగ్ కు నో చెప్పే ఈ బ్యూటీకి తెలుగు సినిమాల్లో ఛాన్సులు దక్కలేదు. దీనికి తోడు ఇటీవల ఆమె చేసిన చిత్రాలు పరాజయం పాలు కావటంతో కొత్త అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలు ఆమెకు నచ్చకపోవటం.. తమిళం.. మలయాళ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు బాగా వస్తున్న వేళ.. టాలీవుడ్ కు గుడ్ బై చెప్పాలన్న నిర్ణయంలో ఉన్నట్లు చెబుతున్నారు. అనుపమ లాంటి అందాల భామ తెలుగు సినిమాలకు దూరం కావటం బాధకు గురి చేసే అంశంగా చెప్పక తప్పదు.