ఏపీలో ఏం జరిగింది - హైలైట్స్  ?

May 26, 2020
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాజధాని మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. 

  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సీఆర్డీయే ను రద్దు చేస్తూ... దాని స్థానంలో VGMTUDA ను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది

  • జాతీయ జెండాలు ధరించిన మహిళలు పోలీసులు అడ్డుపడినా వారిని తోసుకుంటూ అసెంబ్లీ వైపునకు దూసుకెళ్లారు. అసెంబ్లీ ని వెనుకవైపు నుంచి కూడా ముట్టడించడం గమనార్హం. 

  • పాలన వికేంద్రీకరణ  బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. కర్నూలులోనే న్యాయపరమైన అన్ని శాఖలు. హైకోర్టు అనుమతి తర్వాత ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం చేయాలి. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు. సమ్మిళిత అభివృద్ధి మన లక్ష్యం' అని  తెలిపారు.

  • ​అసెంబ్లీలో  ఆర్ధిక మంత్రి బుగ్గన అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆస్తులు అంటూ కొన్ని ప్రస్తావించారు. వారంతా బుచ్చయ్య బినామీలు అన్నారు. దీంతో సీట్లో నుంచి లేచి ఆగ్రహం వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి.. ఆరోపణలు నిరూపించాలని తొడగొట్టి సవాల్ విసిరారు. దీనికి బుగ్గన ఏ రిప్లై ఇవ్వలేదు. 

  • బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేయడంతో తెలుగుదేశం నుంచి బయటకు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ కూడా ఈరోజు టీడీపీ సభ్యులతో కలిసి కూర్చున్నారు. 

  • ఈ రోజు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం అసెంబ్లీలో కునుకు తీశారు. దీనిని లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని టెన్షన్ పెట్టి... రైతులు కన్నీరు పెడుతుంటే ఈ మనిషికి నిద్రెలా పడుతుంది అంటూ లోకేష్ కామెంట్ చేశారు. 

  • గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు రంగంలోకి దిగారు. రైతులంతా తమ గ్రామాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. గ్రామాల్లో ఆందోళనలు చేసుకోవాలంటూ స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ హెచ్చరికతో మరింత ఆవేశానికి లోనైన రైతులు 'జై అమరావతి' నినాదాలతో హోరెత్తించారు. సెక్రటేరియట్ సమీపంలోని పొలాల్లో బైఠాయించి నిరసనలు తెలిపారు.