రేపు తొలి ప్రమాణం ఎవరిది?

September 16, 2019

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ పూర్తిగా నియమించిన నేపథ్యంలో రేపు అసెంబ్లీ ఏర్పాటుచేసి 175 మంది ఎమ్మెల్యేల చేత శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెజారిటీ సంపూర్ణంగా ఉన్న నేపథ్యంలో తమ్మినేని సీతారాంను స్పీకర్ గా ఎన్నుకుంటామన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ గతంలో తమను అవమానించిందని ఆయన పేర్కొన్నారు. తమకు చాంబర్ కూడా కేటాయించకుండా అప్పట్లో తమను అవమానించారని ఆయన చెప్పారు. అయితే మేము అలా చేయదలుచుకోలేదని, ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ అవకాశం కల్పించాలన్నది మా లక్ష్యమని శ్రీకాంత్ చెప్పారు. ఇక 14వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారని వెల్లడించారు.