అదిరింది - 175 ఎమ్మెల్యేల మెప్పు పొందిన టీడీపీ ఎమ్మెల్యే

July 01, 2020

కృష్ణా, గోదావారి న‌దీ జలాల వినియోగంపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ అత్భుత ప్ర‌సంగం స‌భ్యుల‌ను ఆక‌ట్టుకుంది. గోదావారి నుంచి నీటిని త‌ర‌లించి కృష్ణా న‌దిలో క‌లిపే ఆలోచ‌న‌పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. అంతేగాక తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ల ప్ర‌తిపాధ‌న‌ల‌ను కూడా ఆయ‌న నిర్వర్దంగా తోసిపుచ్చారు. ఇవ్వాల మీరు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌ఖ్య‌త‌గా ఉండొచ్చ‌ని.. రేపు ర‌క‌ర‌కాల రాజ‌కీయ కార‌ణాల‌తో దూరం అయితే.. అప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌లు మీ చ‌ర్య‌ల వ‌ల్ల క‌ష్టాలు ప‌డొద్ద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చుర‌క‌లంటించారు.

రాయ‌ల‌సీమ‌కు నీరందించే ప‌నిని ఏ ప్ర‌భుత్వం చేసినా టీడీపీ అభినందిస్తుంద‌ని, స్వాగతిస్తుంద‌ని ప‌య్యావుల అన్నారు. రాయ‌ల‌సీమ‌కు నీరు అందించాల‌ని మొట్ట మొద‌ట ఆలోచ‌న చేసింది.. దానికి రూపాన్నిచ్చింది దివంగ‌త ముఖ్య మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు అని పేర్కొన్నారు. హంద్రీనీవా, గాలేరు-న‌గ‌రి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల రూ ప‌క‌ల్ప‌న జ‌రిగింది నంద‌మూరి తార‌క రామారావు కాలంలోనే అని గుర్తు చేశారు. త‌ర్వాత వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చం ద్ర‌బాబు, ఆ త‌ర్వాత వ‌చ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కేవలం వాటిని కొన‌సాగించారు త‌ప్పిదే కొత్త‌గా చేసిన ప్ర‌తిపాద‌న‌లు ఏ మీ లేవ‌న్నారు.

ఇవాళ‌ మీరు రాయ‌ల‌సీమ‌కు నీరందించాలంటే టీడీపీ స్వాగ‌తిస్తుంద‌ని, అయితే అధికార పార్టీ ఆలోచ‌న‌, ఆచ‌ర‌ణ‌పై ఇటు టీడీపీకి, అటు ప్ర‌జ‌ల్లో అనుమానాలు, భ‌యాలున్నాయ‌ని ఆయ‌న అన్నారు. మ‌న నీటిని, మ‌న భూభాగం నుంచి మాత్ర‌మే త‌ర‌లిస్తే ఎవ‌రికీ అభ్యంత‌రం లేద‌ని, అంతే త‌ప్ప తెలంగాణ‌లోని బీడు భూముల నుంచి నీటిని మ‌ళ్లించాల‌నుకుంటే మాత్రం భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అన్నారు. ఈసంద‌ర్భంగా నీటి కోసం పొరుగు ఉన్న తమిళ‌నాడు, క‌ర్నాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల మ‌ధ్య జ‌రుగుతున్న జ‌ల వివాదాల‌ను ఆయ‌న ఉద‌హ‌రించారు.

అంతేగాక నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతోనే తెలంగాణ ఉద్య‌మం జరిగిందని, ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కట్టుబ‌ట్ట‌ల‌తో మ‌న‌ల్ని బ‌య‌ట‌కు పంపార‌ని గుర్తు చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు తెలంగాణ‌తో నీళ్లు, నిధులు పంచుకుంటే భ‌విష్య‌త్‌లో క‌ష్టాలు కోరి తెచ్చుకున్న‌ట్లే అని ఆయ‌న అధికార ప‌క్షాన్ని హెచ్చ‌రించారు. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌సంగం ఆలోచింప‌చేసేదిగా ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు వైసీపీ స‌భ్యులు అభినందించ‌డం గ‌మ‌నార్హం.