అసెంబ్లీ హైలెట్స్

September 17, 2019

ఎన్నికల అనంతరం తొలిసారి అసెంబ్లీ కొలువు తీరనుంది. మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రతినిధులు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విభజిత ఏపీలో ఇది రెండో అసెంబ్లీ. రాజకీయంగా కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తొలిసారిగా ప్లోర్ లీడర్ గా ప్రమాణం చేస్తారు. ఇక ఈ అసెంబ్లీ విశేషాలు.

* ఉదయం 10.30 గంటలకు శాసనసభలో సీఎం చాంబర్లోకి జగన్ ప్రవేశం. ఇక్కడ పూజలుంటాయి.
* ఉదయం 11.05కు అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జగన్.
* ప్రొటెం స్పీకర్ శంబంగి చినవెంకట అప్పల నాయుడు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
* 13న స్పీకర్ ఎన్నిక
* 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
* 15, 16 తేదీల్లో సెలవులు
* శాసన మండలి టీడీపీ నాయకుడిగా యమనల వ్యవహరిస్తారు.
* శాసన సభ, శాసన మండలిలో ముగ్గురు చొప్పున ఉప నాయకులు ఉంటారు.
* గతంలో లోకేష్ కి ఇచ్చిన ఆఫీసును తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు.
* గతంలో డిప్యూటీ స్పీకర్ కి ఇచ్చిన ఆఫీసును చంద్రబాబుకు కేటాయించారు.
* గతంలో జగన్ కి ఇచ్చిన ఆఫీసు, ఇపుడు వైసీపీ పార్టీ వాడుకుంటుంది