నిమ్మగడ్డని తిట్టి... ఆయన్నే ఫాలో అయిన జగన్

August 07, 2020

కరోనా భయంతో ఎన్నికలు వాయిదా వేసిన పాపానికి నిమ్మగడ్డ  రమేష్ కుమార్ పై కులం అంటగట్టిన ముఖ్యమంత్రి తన మంత్రులు, అనుచరుల చేత అన్ని బూతులు తిట్టించారు. చివరకు పరోక్ష వ్యూహంతో ఆయన పదవిని పీకేయడానికి ప్రయత్నించారు. కానీ అందులో విఫలమయ్యారు. 

కరోనా వస్తుంది, పోతుంది. అంతమాత్రాన ఎన్నికలు వాయిదా వేస్తారా? ముఖ్యమంత్రి నేనా? రమేష్ కుమారా? అంటూ అంతెత్తున ఎగిరి నిమ్మగడ్డను బదనాం చేశారు ముఖ్యమంత్రి. ఎన్నికలు జరగకపోవడం వల్ల ఈరోజు ఏపీలో కరోనా 5 వేల కేసుల వద్ద ఉంది. అదే ఎన్నికలు జరిగి ఉంటే ఇంకెక్కడో ఉండేది. కానీ ప్రజారోగ్యం కోసం వాయిదా వేసిన జగన్ కోపానికి నిమ్మగడ్డ గురయ్యారు.

ఇపుడు మళ్లీ నిమ్మగడ్డనే ఫాలో అవుతున్నారు జగన్. కరోనా వ్యాపిస్తుందన్న భయంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండే రోజులకు కుదించారు. మంత్రి వర్గంలో 5 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని 16-20 వ తేదీ వరకు అని డేట్లు ప్రకటించారు. 

కానీ కరోనా వ్యాప్తి వల్ల రెండ్రోజులకే బడ్జెట్ సమావేశాలను కుదించారు. 16న మంగళవారం గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం, బడ్జెట్ ఆమోదం అన్నీ చేసేస్తారు. బుధవారం కొన్ని కీలక బిల్లులను  ఆమోదిస్తారట. అవి రహస్యం. ఇంకా వెల్లడించలేదు. 

కరోనా వల్ల అసెంబ్లీని కుదిస్తే ఇప్పటికైనా రమేష్ కుమార్ ను దూషించడం తప్పని వైసీపీ రిగ్రెట్ కావాలి. కానీ అవదు. చివరకు ఆయననే ఫాలో అయిపోయారు.