ఆ భయం జగన్ లో కనిపిస్తోంది

May 26, 2020

కేసీఆర్ తిరుగులేని నేత అని ఆంధ్రోళ్లు కూడా డబ్బా కొడుతున్న నేపథ్యంలో సొంత కూతురు పట్టున్న జిల్లాలో ఓడిపోవడం దేనికి చిహ్నం?... శృతిమించిన అహంకారానికి ప్రజలు ఇచ్చిన సమాధానం అది. మొదటిసారి చాలా హామీల్లో విఫలమైనా, మునుపటి ప్రభుత్వం కంటే కొంచెం బెటర్ అని, ఇంకొక్కసారి ఛాన్స్ ఇద్దామని జనం భావించడం వల్ల కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అదంతా తన అద్భుతమైన పాలనకు ఫీడ్ బ్యాక్ అనుకున్న కేసీఆర్... రెండు భారీ తప్పిదాలు చేసి జనం చేతిలో చావుదెబ్బ తిన్నాడు. వీటి వల్ల అలర్ట్ అయిన జగన్ జాగ్రత్త పడుతున్నారు.
మంత్రి వర్గ ఏర్పాటు చేయకుండా రెండు నెలలు వాయిదావేయడంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీ సమావేశ పరచలేదు. ఇలాంటి అతి ముఖ్యమైన పని వదిలి... ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడం మొదలుపెట్టాడు కేసీఆర్. అందుకే జనానికి చిర్రెత్తుకు వచ్చి సారు లేదు, పదహారు లేదు అంటూ లాగి పీకితే గతం కంటే ఎంపీ సీట్లు తగ్గిపోయాయి. దీంతో ఇటీవలే గెలిచిన జగన్ బాగా అలర్ట్ అయ్యారు. జనం కొంచెం అదుపులో ఉంటేనే సహిస్తారు, లేకపోతే పీకి అవతలపడేస్తారు అని అర్థం చేసుకున్న జగన్ ఏ విషయంలోనూ ఆలస్యం చేయడం లేదు.
జూన్ 8వ తేదీని జగన్ సచివాలయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. అదే రోజు మంత్రి వర్గ ఏర్పాటు కూడా ఉంటుంది. పదో తేదీన మంత్రి వర్గ సమావేశం, 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. స్పీకర్ ఎంపిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు ఉంటుంది. వేగంగా పనులు చేపట్టడంపై పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. ఎపుడెపుడు జనాలతో మెప్పు పొందుతామా అని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే అమరావతి, పోలవరాన్ని అడ్డంగా ఆపేయడంపై జనం కోపంగా ఉన్నారు. అమరావతి విషయంలో అయినా కొంచెం జగన్ ని క్షమిస్తారేమో గాని పోలవరం కనుక పూర్తి చేయలేకపోతే జగన్ ఇక 2024 ఎన్నికలను మరిచిపోవాల్సిందే. ఎందుకంటే అప్పటిలోపు ఎలాగూ మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు. ఆ మాటకొస్తే... మోడీ ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదు.  ఇక కాపాడితే పోలవరమే కాపాడాలి. మరి దీనిని జగన్ గ్రహించే పరిస్థితి కనిపించడం లేదు. పోలవరం ఒక ఉద్యమంలా చేపడితేనే పూర్తవుతుంది. జగన్ తన హామీలు అమలుచేయడానికి డబ్బులు సరిపోవు. సంపద సృష్టిలో అనుభవం లేదు. మోడీ పెండింగ్ ఉన్న 38 వేల కోట్లు ఇచ్చే ప్రసక్తి లేదు. జగన్ కి ఆయనన్ను అడిగే దమ్ము, అవకాశం రెండూ లేవు. ఇక ఏపీని ఎవరు కాపాడుతారో?