జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు !!

August 03, 2020

ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన ఘోరంగా తయారైందని... ఒక పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేవు, కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త పథకాలు పెట్టినా కేవలం 30-40 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే అందుతున్నాయని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఏపీ 667 అవార్డులను సాధించిందని...జగన్ చేతగాని పాలనతో ఏపీ దేశ విదేశాల్లో నవ్వుల పాలవుతోందన్నారు.

వైసీపీ నేతల దౌర్జన్యాలను చూసి ఆంధ్రప్రదేశ్ ను బీహార్ ఆఫ్ సౌత్, గవర్నమెంట్ టెర్రరిజం అంటూ వేలెత్తిచూపుతున్నారని చంద్రబాబు అన్నారు. పీపీఏల రద్దుతో దేశ వ్యాప్తంగా పరువు పోయింది. రివర్స్ టెండరింగ్, మూడు రాజధానులతో ప్రజల డబ్బులు పోతున్నాయి. రివర్స్ పాలనతో యువత భవిష్యత్తు పోతోందని బాబు తీవ్ర వ్యాఖ్యు చేేశారు.

గతంలో పెట్టుబడులకు దేశంలోనే ఏపీ మెరుగైన ఎంపికగా ఉండేదని... జగన్ పాలనతో ఏకంగా ఇండియాకే పెట్టుబడులు రాకుండా అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. అందుకే జగన్ ను అందరూ తుగ్లక్ 2.0 జీరో అంటున్నారన్నారు. పాలకులకు బాధ్యత లేకపోతే పాలన ఎలా ఉంటుందో చూపడానికి ఏపీ ఒక ఉదాహరణగా మారిపోయిందన్నారు. వాటాల కోసం బెదిరించిపెట్టుబడులను తరిమేసిన వీళ్లు కొత్తకంపెనీలు తెస్తామంటే జనం నవ్వుతున్నారని అన్నారు.

విభజన తర్వాత రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా ఎదిగింది. 5 ఏళ్లు వరుసగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. పెట్టుబడుల గమ్యస్థానం అయ్యింది. అనేక రంగాలలో దేశంలో నెంబర్ 1 గా మారింది. అలాంటి ఏపీకి కేవలం ఒక్క ఏడాదిలో జగన్ 2 దశాబ్దాలు వెనక్కు నెట్టేశాడని చంద్రబాబు వాపోయారు.

 'ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన ఘోరంగా తయారైందని ... ఒక పరిశ్రమ లేదు, ఉద్యోగాలు లేవు, కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త పథకాలు పెట్టినా కేవలం 30-40 శాతం మంది లబ్ధిదారులకు మాత్రమే అందుతున్నాయని‘ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో ఏపీ 667 అవార్డులను సాధించిందని...జగన్ చేతగాని పాలనతో ఏపీ దేశ విదేశాల్లో నవ్వుల పాలవుతోందన్నారు.