ఏపీ సర్కారుపై బీజేపీ పంచ్... నెక్ట్స్ లెవెల్

June 02, 2020

సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్నవాడు కింగ్. ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చుని కోట్లు సంపాదించొచ్చు. కావల్సిందంతా క్రియేటివిటీయే. అది మన కాంపిటీటర్ మన సమీపంలోకి కూడా రానంత క్రియేటివ్ గా ప్రజెంట్ చేయాలి. సోషల్ మీడియాలో బలం ఎవరికి ఉంటుందో  వారికి అధికారం దగ్గరగా ఉంటుంది. అయితే... జాతీయ స్థాయిలో సత్తాచాటగలుగుతున్న బీజేపీ ఏపీలో తన ఉనికిని కాపాడుకోలేకపోతోంది. తాజాగా ఆ ప్రయత్నాల్లో పడినట్టు తెలుస్తోంది. కానీ వారు ఎంత దాకా వెళ్తారు అన్నది ఇంకా అంచనాకు చిక్కలేదు. 

తాజాగా బీజేపీ సోషల్ మీడియా విభాగం జగన్ సర్కారుపై ఒక పంచ్ వేసింది. సాధారణంగా ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ శాఖ విమర్శిస్తూ ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఈరోజు ఏపీ సర్కారుపై బీజేపీ ఏపీ శాఖ వేసిన సెటైర్ మాత్రం విపరీతంగా పేలింది. ప్రతి ఒక్కరూ వావ్ అనే స్థాయిలో ఉంది. చాలా చిన్న థాట్ తో జగన్ పీకి చేసింది ఏమీ లేదని చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఇది చదువుకున్న వారికి అర్థమయ్యేలా ఉంది. కానీ బాగా పేలింది. 

ఆంధ్రప్రదేశ్ అనే ఫోల్డరులో ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ పోతే అందులో జగన్, ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కాని అభివృద్ధి ఫోల్డరు మాత్రం కనిపించడం లేదన్నది దాని సారాంశాం. చాలా చిన్న థాట్. కానీ క్యాచీగా ఉంది. ఏపీ సర్కారు సిగ్గుపడే రీతిలో ఉందా సెటైరు. వైసీపీ సర్కారుకు సిగ్గు ఎక్కడ ఉంది అని మీరు అడిగితే మేమేమీ చెప్పలేం కానీ... ట్వీట్ మాత్రం పేలిందని చెప్పగలం.