జగన్ రివెంజ్... బిగ్ షాక్ టు ఏబీఎన్ ఆర్కే

July 07, 2020

ఇప్పటికే ఆంధ్రజ్యోతి ప్రసారాలు బ్యాన్ చేసి... రాధాకృష్ణపై తన ప్రతాపం చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మరో షాకిచ్చాడు. గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి కేటాయించిన కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని కేబినెట్లో తీర్మానించారు. ఇది రాధాకృష్ణకు కచ్చితంగా భారీ ఝలక్. 

విశాఖపట్నం నగరం, పరదేశీ పాలెం అనే ప్రాంతంలో రాధాకృష్ణకు చెందిన ఆమోద పబ్లికేషన్స్ సంస్థకు ఎకరన్నర భూమి కేటాయించింది. దీని మార్కెట్ విలువ 30 కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. మీడియా కేటాయింపుల్లో భాగంగా దీనిని 50 లక్షలకు గత ప్రభుత్వం కేటాయించింది. తాజాగా జగన్ సర్కారు దానిని ఉపసంహరించుకుంది.

ఆంధ్రజ్యోతికి చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టారని, ఇప్పటికే ఆ పత్రికకు స్థలం ఉందని, ఇంకా అదనపు స్థలం అవసరం లేదని... కేబినెట్ తీర్మానించింది. ఆమోద సంస్థ ఆ స్థలంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ప్రభుత్వం కేటాయించిన ఉద్దేశం నెరవేరడం లేదని, అందున ఆ స్థలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ఏపీ కేబినెట్ పేర్కొంది.