జగన్ కేబినెట్ మొత్తం జాబితా

August 03, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండు వారాల నిరీక్షణ అనంతరం మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటికే గవర్నర్ ను కలిసిన జగన్ లిస్టును ఆయన ముందుంచారు. మరోవైపు జగన్ ఆఫీసు నుంచి మంత్రులకు కాల్స్ వెళ్లాయి. దీంతో చాలావరకు పేర్లు బయటకు వచ్చాయి. టీడీపీకి పట్టుకొమ్మలయిన బీసీలను ముందు నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్న జగన్ మంత్రి వర్గంలోనూ వారికి ఎక్కువ పోస్టులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 25 మంది మంత్రుల్లో...ఏడుగురు బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కాగా ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తున్నారని తెలుస్తోంది. రేపు ఉదయం 11.30 కు ముందే నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గవర్నర్ నరసింహన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు.

ఏపీ కేబినెట్ - ఫుల్ లిస్టు

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు, చిత్తూరు జిల్లా)

2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్, కర్నూలు జిల్లా)

3. మేకపాటి గౌతం రెడ్డి (ఆత్మకూరు, నెల్లూరు జిల్లా)

4. పుష్ప శ్రీవాణి (కురుపాం, విజయనగరం జిల్లా)

5. కొడాలి నాని (గుడివాడ, కృష్ణా జిల్లా)

6. నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా)

7. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (ఆచంట,పశ్చిమ గోదావరి జిల్లా)

8. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు, ప్రకాశం జిల్లా)

9. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ, నెల్లూరు జిల్లా)

10. అవంతి శ్రీనివాస్ (భీమిలి, విశాఖపట్టణం జిల్లా)

11. అంజాద్ బాషా (కడప, కడప జిల్లా)

12. ఆళ్ల నాని (ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా)

13. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా)

14. కన్నబాబు (కాకినాడ రూరల్, తూర్పు గోదావరి జిల్లా)

15. ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)

16. పిల్లి సుభాస్ చంద్రబోస్ (పశ్చిమ గోదావరి జిల్లా)

17. మేకతోటి సుచరిత (పత్తిపాడు, గుంటూరు జిల్లా)

18. పేర్ని నాని (మచిలీపట్నం, కృష్ణా జిల్లా)

19. తానేటి వనిత (కోవూరు, పశ్చిమ గోదావరి జిల్లా)

20. పినిపే విశ్వరూప్ (అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా)

21. ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి, గుంటూరు జిల్లా)

22 గుమ్మనూరు జయరాం (ఆలూరు, కర్నూలు జిల్లా)

23. వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ, కృష్ణా జిల్లా)

24. మోపిదేవి వెంకటరమణ (గుంటూరు జిల్లా)

25. శంకర్ నారాయణ (పెనుగొండ, అనంతపురం జిల్లా)