జగన్ సంచలనం - ఏపీ హోం మంత్రి లేడీ

May 29, 2020

అచ్చం తండ్రి వైఎస్‌లాగే ఒక మహిళకు హోం మంత్రిత్వ శాఖ కేటాయిస్తూ జగన్ మంత్రులకు శాఖలు పంచారు. పీఆర్పీ నుంచి వచ్చిన కన్నబాబుకు కీలకమైన వ్యవసాయ శాఖ ఇచ్చారు. తనను తాను మాస్ లీడర్ అనుకునే బొత్స సత్యనారాయణకు మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తాను ఇష్టపడే ఇరిగేషన్ శాఖను తన విధేయుడు అనిల్ కుమార్ యాదవ్ కు కేటాయించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి సాధారణ శాఖలే దక్కాయి. దీన్ని బట్టి కీలక శాఖల పర్యవేక్షణ జగన్ ఆధ్వర్వర్యంలోనే జరగనుందని అర్థమవుతోంది.

మంత్రులు.. శాఖలు
01. మేకతోటి సుచరిత-హోంశాఖ (డిప్యూటీ సీఎం)

02. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి - ఆర్థిక శాఖ‌

03. బొత్స సత్యనారాయణ - మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ

04. అంజాద్‌ బాషా- మైనారిటీ వ్యవహారాలు(డిప్యూటీ సీఎం)

05. నారాయణ స్వామి-ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు(డిప్యూటీ సీఎం)

06. మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం

07. పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ -రెవెన్యూ శాఖ

08. కన్నబాబు - వ్యవసాయ శాఖ

09. పుష్ప శ్రీవాణి - గిరిజన సంక్షేమం

10. తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం

11. కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ

12. మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ

13. పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం

14. ఆళ్ల నాని- వైద్య,ఆరోగ్య శాఖ

15. పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ

16. ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ

17. బాలినేని శ్రీనివాస్‌ - అటవీ,పర్యావరణం

18. గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -పంచాయతీరాజ్‌

20.నారాయ‌ణ స్వామి - ఎక్సైజ్‌

21. అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ

22. శంకర్‌ నారాయణ-బీసీ సంక్షేమం

23. వెల్లంపల్లి శ్రీనివాసరావు-దేవాదాయ శాఖ

24. ధర్మాన కృష్ణ దాస్‌- రోడ్లు, భవనాలు

25. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ -జలవనరుల శాఖ