బిగ్ బ్రేకింగ్ - ఏపీ రాజధాని మార్పు ఆగస్టు 15న

August 08, 2020

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై తన మనసు జగన్ ఏమీ మార్చుకోలేదని స్పష్టమైపోయింది. తాజగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ రాజధానిని ఆగస్టు 15 నుంచి విశాఖకు మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మేము సిద్ధంగా ఉన్నట్లు డీజీపీ కూడా చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు కోర్టుల్లో దీనిపై కేసులు నడుస్తున్నా కూడా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వెనక్కు తగ్గడం లేదు. తన మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడే ఉన్నట్లు తెలుస్తోంది. 

బీజేపీ అమరావతిపై గోడమీద పిల్లిలా ఉండటం చూస్తే రాజధాని మార్పునకు జగన్ కే మద్దతు పలుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించింది ఇంతవరకు కేంద్రమే. తాజాగా తెలంగాణ, జమ్ము ఏర్పాటులోను రాజధాని నిర్ణయించింది కేంద్రమే. రాజ్యాంగంలో కేంద్రానికి మాత్రమే రాజధాని నిర్ణయించే హక్కుంది. అయినా బీజేపీ ఏపీ రాజధాని తరలింపును అడ్డుకోవడం లేదంటే... అది కచ్చితంగా జగన్ కి మద్దతుగా నిలిచినట్టే అర్థం చేసుకోవాలి. 

వైసీపీ అభిమానులతో సహా తప్ప ... ఏపీలోని అత్యధికులు రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజధానిని మార్చాలన్న ఆలోచనే అనవసరం అంటున్నారు. ఇంతవరకు దీనిపై జరిగిన అన్ని సర్వేలు మూడు రాజధానులకు వ్యతిరేకంగానే వచ్చాయి. ఇలా రాజకీయ కారణాలు, ఆలోచలతో రాజధానులను మార్చడం ఏపీకి ముప్పు అన్నది మేధావులు, సాధారణ ప్రజల అభిప్రాయం. అది రాష్ట్ర పరిధి అయితే భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రులు అందరూ రాజధాని మార్పును చేసుకుంటూ పోతే ఆయా రాష్ట్రాల పరిస్థితి ఏంటి?