జగన్ మాటకు కేంద్రం ఓకే !

August 06, 2020

జగన్ కోరికను ఒకటి కేంద్రం మన్నించింది. ఈ నెలాఖరుతో ముగియనున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని పదవీకాలం పెంచాలని జగన్ చేసిన వినతికి కేంద్రం ఆమోదించింది. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని తనకు నచ్చిన అధికారి గడువును పెంచుకున్నారు. ఇపుడు ఆ వెసులుబాటును జగన్ కూడా వాడుకున్నారరు.

జగన్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని పంపిన ఫైలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే జగన్ అడిగినట్లు ఆరు నెలలు కాకుండా కేవలం 3 నెలలు మాత్రమే పొడిగించింది. దీంతో మరో 3 నెలల పాటు నీలం సాహ్నియే కొనసాగనున్నారు. నీలం సాహ్ని పుట్టిన రోజు ఈ పొడగింపు ఆర్డరు రావడంతో ఆమెకు ఇది బర్త్ డే గిఫ్ట్ అయ్యింది.

సీఎస్ నీలం సాహ్ని 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రికార్డుల కెక్కింది. ఎల్వీ సుబ్రమణ్యం స్థానంలో ఈమె వచ్చింది. మరో మూడునెలల అనంతరం ఈమె స్థానంలో కొత్త సీఎస్ రానున్నారు. ఈ పోస్టు కోసం సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్‌లు రేసులో ఉన్నారు. వీరి ముగ్గురిలో కాబోయే సీఎస్ ఎవరో మరి?