ప్రధాని చెప్పినా కేర్ చేయని జగన్... అందుకేనా?

August 08, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్... చివరకు మోడీ మాట కూడా వినడం లేదా? బహిరంగంగా... ప్రధాని నుంచి సర్పంచి వరకు అందరూ మాస్కు లేదా తువ్వాలు, లేదో ఏదో ఒకటి వాడాలన్న ప్రధాని హెచ్చికను జగన్ పట్టించుకోవడం లేదా అంటే అవుననే తెలుస్తోంది. ప్రధాని జనాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది, అందరూ మాస్కు పెట్టుకోమని చెప్పినా... ఏ సందర్భంలోను జగన్ మాస్క్ పెట్టుకోలేదు. 

ప్రధాని చెప్పిన మరుసటి రోజు మాత్రం మాస్క్ పెట్టుకున్నారు. అది కూడా 108 ప్రారంభోత్సవాల్లో జనాల్లో ఉన్నపుడు మాస్క్ పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత వాడటం మానేశారు. ఏపీలో ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోకుండా జనాలకు మాస్కుల గురించి ప్రభుత్వం సూచనలు ఇవ్వడం ఏవిధంగా వారు సమర్థించుకుంటారో గాని ఇపుడు ఒక కొత్త విషయం బయటకు వస్తోంది.

అమరావతి విషయంలో, రఘురామరాజు విషయంలో బీజేపీ తీరు పట్ల జగన్ చాలా అసంతృప్తిగా ఉన్నారట. తన వినతులు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడట. కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉన్నా కూడా బీజేపీ తనకు వ్యతిరేకంగా పనిచేయడం జగన్ కి నచ్చడం లేదట. తనకు ఉపయోగపడనపుడు మోడీ మాటయినా వినాల్సిన అవసరం ఏముందన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. తాను చేపడుతున్న పథకాలతో తనను దించేసినా జనంలో మళ్లీ గెలుస్తాను అని కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని జగన్ భావిస్తున్నట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈరోజు వైఎస్ జయంతి సందర్భంగా కడపకు వచ్చిన జగన్ అస్సలు మాస్కు వాడలేదు. ఆయన చుట్టు ఉన్న ప్రతి ఒక్కరు మాస్కు వాడారు. కానీ జగన్ మాత్రం మాస్క్ వాడలేదు. జనం అయితే.... సీఎం మాస్క్ వాడనపుడు మనకేం అవుతుందిలే అని మాస్క్ వాడటం మానేస్తున్నారట. అధికారులు, పోలీసులు ప్రశ్నిస్తే... కలిసి జీవించమని సీఎం చెబుతున్నారు, ఆయనే మాస్క్ పెట్టుకోవడం లేదు అని జనం ప్రశ్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో మాస్క్ పై పెద్ద చర్చ జరుగుతుంది ఏపీలో.