ఏపీ సీఎం ను అవమానించిన టెక్నాలజీ

July 12, 2020

కొన్ని ఆలోచనలు చాలా క్రేజీగా ఉంటాయి. నేటి తరం పాదరసంలా ఆలోచించి క్రేజీగా బతికేస్తుంది. ఎవరో ఒక నెటిజన్ దేనికోసమో ఒక పాస్ వర్డ్ క్రియేట్ చేయాలనుకున్నాడు. సర్లే చూద్దాం అని పాస్ వర్డ్ గా ’’ఏపీ సీఎం జగన్‘‘ అని టైప్ చేశాడు. జనరల్ గా గూగుల్ ఆల్గారిథమ్స్.. పాపులర్ సెర్చి ప్రేజస్ ని వీక్ పాస్ వర్డ్ గా భావిస్తుంది. గూగుల్ లో రకరకాల సెర్చిలలో ఏపీ సీఎం జగన్ అని వస్తుంది కాబట్టి... ఆ పాస్ వర్డ్ కొట్టగానే ఇది సూపర్ వీక్ పాస్ వర్డ్ అని చూపింది. ఆ యువకుడు ఎవరో మరింత క్రేజీగా ఆలోచించి... ‘‘ఏపీ సీఎం కేసీఆర్’’ అని టైప్ చేసి చూశాడు. సహజంగానే గూగుల్ సెర్చ్ లో ఈ ప్రేజ్ కనిపించదు. కాబట్టి... అది స్ట్రాంగ్ పాస్ వర్డ్ గా చూపించిది. ఇది కాస్తా స్క్రీన్ షాట్ గా మారి ఇంటర్నెట్లో దుమ్ములేపుతోంది. 

ఏపీ సీఎం కేసీఆర్ అని అందరికీ తెలిసిపోయింది...  టెక్నాలజీ యంత్రాలతో సహా అన్నట్లు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జగన్ అసమర్థత వల్లే ఇలా జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిమానులు, పార్టీ వారు దీనిని చూసి చిన్నబుచ్చుకున్నారట. ఏంటో మరి... ఈ ఇంటర్నెట్ యుగంలో యువతను ఆపగలమా? వారి ఆలోచనలను కంట్రోల్ చేయగలమా?