జగన్ .. దిసీజ్ మైండ్ బ్లోయింగ్

May 25, 2020

ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదిక విషయంలో ఈరోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇక్కడ జరిగే చివరి సమావేశం ఇదేనని ఇక నుంచి ప్రజావేదిక ఉండదు అని స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను మా ప్రభుత్వం సహించదు అని వాటిని కూల్చివేస్తాం అని చెప్పిన జగన్ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుంచే మొదలుపెడతాం అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, ఎల్లుండి నుంచి దీన్ని కూల్చివేయాలని అక్కడే జరుగుతున్న మీటింగ్ లో జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా... ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రజా వేదిక అవినీతి సొమ్ముతో కట్టినదని, అందుకే కూల్చేస్తున్నాం అన్నారు. బహుశా ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని లాజిక్ ఇది. ప్రభుత్వ కట్టడం అవినీతి సొమ్ముతో కట్టడం ఏంటో? జగన్ కే తెలియాలి. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, అన్నిటికీ చెక్‌ పెట్టాలని జగన్ ఆదేశించారు.
ఈ సందర్భంగా మరో ఆణిముత్యం జగన్ నోటి నుంచి వచ్చింది. ‘‘వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం’’ అన్నారు. అక్కడ సమావేశం ఏర్పాటుచేస్తే దిగజారి పోయిందనే విషయం ప్రజలకు ఎలా తెలుస్తుందో జగన్ రెడ్డికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
ప్రజావేదిక అక్రమమని ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. మరి అదే సీఆర్డీయే దానికి అనుమతి ఇచ్చిందన్ విషయాన్ని జగన్ కు ఎవరూ చెప్పలేదా? ఏంటో ఈ లాజిక్ లు జగన్ రెడ్డికి తప్ప ఎవ్వరికీ అర్థం కావు.