జగన్ పై ​రామ్ మాధవ్​ సంచలన వ్యాఖ్యలు

August 13, 2020

మోడీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకెళ్తుంటే... జగన్ నాయకత్వంలో రాష్ట్రం వెనక్కు పరుగెడుతోందని బీజేపీ నేషనల్ సెక్రటరీ రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిలు మీద ఉన్నాయన ఏపీని పాలిస్తూ రివర్సు పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రివర్స్ పాలన ఏపీలో రాజధానిలో మొదలై ఇంకా రివర్స్ లో శరవేగంతో వెనక్కువెళ్తోందన్నారు. రాజధాని రివర్సు, పోలవరం రివర్సు, మద్యపాన నిషేధం రివర్సు... అంటూ చురకలు వేశారు రామ్ మాధవ్. చివరకు తిరుమల భూములు అమ్ముదామని ప్రయత్నిస్తే ప్రజలు రివర్స్ అయ్యేటప్పటికి జగన్ రిటర్న్ అయ్యాడన్నారు. 

ఏడాది నుంచి వారానికి ఒకసారి కోర్టుతో మొట్టికాయ తిన్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సృష్టించారని రామ్ వ్యాఖ్యానించారు. జగన్ పుణ్యమా అని ఏపీ ఆదాయం పెరగక పోగా తగ్గిపోతూ వస్తోందన్నారు. పన్నులు వసూలు కాకపోయినా రెండు విడతల్లో ఏపీకి కేంద్రం 10 వేలకోట్లు ఇచ్చిందని మాధవ్ అన్నారు.

విచిత్రమేంటంటే... సుప్రీంకోర్టు తలంటడం వల్లనో, ప్రజల్లో ఇటీవల బీజేపీ నిర్వహించిన సర్వే ఫలితాలు జగన్ కు వ్యతిరేకంగా రావడం వల్లనో బీజేపీ నేతలకు జ్జానోదయం అయినట్టుంది. మొన్ననే నువ్వు సూపర్ జగన్న అన్న మాధవ్ మాట మడతేశారు. జైలు సీఎం అంటున్నారు. మొన్న అమిత్ షా అపాయింట్ మెంట్ రద్దు చేయడం, నేడు రామ్ మాధవ్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదో జరుగుతోంది.