జగన్ వ్యాక్సిన్ చేయడం లేదు నానీ !

June 03, 2020

చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు మందు లేదు, వ్యాక్సిన్ లేదు.  అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రం వ్యాక్సిన్ లా మారి దానిని ఏపీలో భూస్థాపితం చేశారు అని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్ పై ఇపుడు సెటైర్లు పేలుతున్నాయి. ఏం నానీ జగన్ వ్యాక్సిన్ అంటివి, భూస్థాపితం అంటివి ఏమైంది మీ వ్యాక్సిన్ అని జనం నిలదీస్తున్నారు. భయంకరమైన ఈ కరోనా ఏపీని చుట్టుముట్టింది.

తాజా లెక్కల ప్రకారం ఏపీలో యాక్టివ్ కేసులు తెలంగాణను మించిపోయాయి. ఈరోజు సాయంత్రానికి ఏపీలో 190 కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా ఈరోజు కృష్ణా జిల్లాలో 5 కేసులు, గుంటూరు జిల్లాలో మూడు కేసులు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో 32 కేసులు చొప్పున ఉండగా... అనంతపురంలో అతి తక్కువగా మూడు కేసులు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఆ జిల్లా వాసులు అదృష్టంగా చెప్పొచ్చు.

ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విషయం కఠినంగా పాటించాలని ప్రయత్నించడం ద్వారా విఫలం చేస్తోంది. కేవలం మూడు  గంటలు మాత్రం మార్కెట్స్ ఓపెన్ పెట్టడంతో అందరూ కంగారు పడుతూ సామాజిక దూరాన్ని మరిచిపోతున్నారు. పెరుగుతున్న కేసులు ఏపీ ప్రజలను భయపెడుతున్నాయి.