రోజా సెల్ఫీ జగన్ కొంప ముంచింది

July 01, 2020

లాజిక్ తో ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తులు. తాజాగా శాసన మండలిలో వైసీపీ ఎంత అరాచకంగా వ్యవహరించిందో వీడియోలు చూశాం. మంత్రులు, శాసన సభ్యులు అయినటువంటి వారు కుర్చీలు బల్లలు ఎక్కి సభాధ్యక్షుడిని బెదిరించడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కళ్లారా చూశాం. అయితే... ఇంత అల్లరి జరుగుతుంటే రోజా తన ఫోన్ తో బాలకృష్ణతో సెల్ఫీలు తీసుకుంది. ఆమె సరదాగా తీసుకున్న సెల్ఫీలు ఆమెను అడ్డంగా బుక్ చేశాయి.

నాతో్ పాటు కొందరు వైసీపీ సభ్యులు గ్యాలరీలో ఉన్నారు. రోజా కూడా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను. ప్రతిపక్ష పార్టీ అధక్షుడిని. నా ఫోన్ ను లాక్కున్నారు. అదేమని అడిగితే... గ్యాలరీలోకి అనుమతి లేదు అన్నారు. ఇదేం రూల్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ...లైవ్ ప్రసారాలు కట్ అయ్యాక అర్థమైంది. అక్కడి దృశ్యాలు జనాలకు తెలియకుండా వైసీపీ మేనేజ్ చేద్దామని ప్రయత్నం చేసిందని..!! ఈ వైసీపీ ద్వంద్వ ప్రమాణాలపై చంద్రబాబు మండిపడ్డారు. మండలిలలోకి నా సెెల్ ఫోను తేనివ్వలేదు. అడిగితే రూల్ అన్నారు. మరి వైసీపీ వాళ్ల సెల్ ఫోన్లు ఎందుకు అలో చేశారు. గ్యాలరీకి వైసీపీకి మాత్రమే సెల్ ఫోన్లు అలో చేశారు అని చెప్పడానికి రోజా తీసుకున్న సెల్ఫీయే సాక్ష్యం అంటూ చంద్రబాబు నిలదీశారు. 

బాబు వాదనతో వైసీపీ ఇరుకున పడింది. మేం తేలేదు అని చెబుదామా అంటే... ఆ సెల్ఫీ వైరల్ అయ్యింది. అందరూ చూసేశారు. ఇంకో కారణంతో సాక్షి పత్రికలో కూడా ప్రచురించారు. దీంతో దీనిపై ఎలా స్పందించాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడింది వైసీపీ. రోజా తన అత్యుత్సాహంతో జగన్ ని ఇలా బుక్ చేసింది.