​బాబు చేసిన పనికి... కేంద్రం రివార్డు

August 07, 2020

ఎన్టీఆర్, వైఎస్సార్, జగన్ వంటి నేతలు పాలనలో ఉంటే... జనానికి నచ్చుతారు. ఎందుకంటే వారిచ్చే ప్రతిపైసా పేదలకు సామాన్యులకు తక్షణం చేతికందుతుంది. కానీ చంద్రబాబు, మన్మోహన్, వాజ్ పేయి వంటి వారు పాలకులుగా ఉంటే... వారి ప్రభావం తాత్కాలికంగా కనిపించదు. కానీ కొంతకాలం తర్వాత తరచుగా వారు చేసిన పనికి ఫలితాలు అందుతూనే ఉంటాయి. అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. మొదటి వర్గం లీడర్లు ప్రభుత్వంపై భారం వేసిపోతూ ఉంటారు. రెండో వర్గం నాయకులు ప్రభుత్వాలకు ఆదాయం పెంచుతూ పోతుంటారు. 

ఆంధ్రప్రదేశ్ నే ఉదాహరణగా తీసుకుంటే... 

అపుడు పట్టిసీమ కడితే ఇపుడు వానలు రానపుడు అయిన పంటలకు నీరొచ్చింది.

అపుడు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే దేశంలోనే అందులో ఏపీ నెం.1 తేలినట్టు మొన్ననే కేంద్రం చెప్పింది

అపుడు విద్యుత్ కంపెనీలను విపరీతంగా ప్రోత్సహిస్తే... ఏపీ దేశంలోనే మిగులు ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా రికార్డు నిలబెట్టింది

అపుడు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీ ఆయువుపట్టు టూరిజం అని గుర్తించి సంస్కరణలు తీసుకుంటే... తాజాగా జాతీయ పర్యాటక అవార్డు ఏపీకి దక్కింది.

గత నాలుగు సంవత్సరాల్లో పర్యాటకరంగాన్ని ఏపీ కొత్త పుంతలు తొక్కించిందని కీర్తిస్తూ కేంద్రం ఏపీకి జాతీయ పర్యాటక అవార్డు ప్రకటించింది. 2017-18 (బాబు హయాం) కి పర్యాటక రంగంలో ఏపీ నెం.1 నిలబడింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజే అవార్డులను ప్రకటించారు. అందరూ పర్యాటక స్వర్గంగా పిలిచే గోవాను కూడా ఆంధ్రప్రదేశ్ వెనక్కి నెట్టింది అంటే... ఏపీలో టూరిజం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. విజన్ అంటే... భవిష్యత్తును నిర్మించడం. అది జనాలు గుర్తించేలోపు చంద్రబాబు ఓడిపోతూ ఉంటారు. మళ్లీ అర్థమయ్యే సరికి జనం కొంప మునిగిపోతుంది.