రెండో సంఘటనకే జగన్ రివర్స్ గేర్ !

August 06, 2020

ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయిన ప్రాణానికి విలువెక్కువనా? రాంకీ ఫార్మా లో చనిపోయిన ప్రాణం విలువ తక్కువనా? ఇదేమీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణా కాదు, మీడియా చేస్తున్న వ్యాఖ్యానమూ కాదు... ప్రభుత్వం తన చేతల ద్వారా నిరూపించిన నిజం. ఎల్జీ పాలిమర్స్ మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్... తాజాగా జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాసరావు కుటుంబానికి కేవలం 15 లక్షల పరిహారం మాత్రమే ప్రకటించారు. రాంకీ ఫార్మా సిటీ మరో 35 లక్షల పరిహారం ప్రకటించింది. 

ఇక రాంకీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ సర్కారు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మల్లేష్‌ అనే కార్మికుడి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ప్రమాద పరిహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదానికి కారణమైన రాంకీ సాల్వెంట్ కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేయకుండా పరామర్శకు వెళ్లిన నేతలను అరెస్టు చేస్తారా? అంటూ చంద్రబాబు నిలదీశారు.