పబ్లిసిటీ పిచ్చితో చట్టం ఉల్లంఘించిన ఏపీ

June 04, 2020

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది ఎందుకు? కరోనా చైన్ ను బ్రేక్ చేయడానికి. కానీ ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చి మహాదారుణంగా ఉంది. లాక్ డౌన్ నిబంధనలు మొత్తం తుంగలో తొక్కింది ఏపీ సర్కారు. ఇటీవల తెలంగాణ నుంచి 17 మంది కరోనా రోగులు కోలుకుని విడుదల అయినా వారు ఎవరు అన్నది తెలంగాణ ప్రభుత్వం ఎవరికీ చెప్పలేదు. చట్టం ప్రకారం అంది పూర్తిగా తప్పు. ఎందుకంటే అతనిని సమాజం దూరంగా పెట్టే ప్రమాదం ఉంది. అతని కుటుంబానికి కూడా ఇది ఇబ్బందే. అందుకే కరోనా రోగుల ఫొటోలు, వివరాలు వెల్లడించవద్దని కేంద్రం కఠినంగా చెప్పింది. చట్టాలు కూడా చేసింది.

పబ్లిసిటీ కోసం మొన్నే న్యూయార్క్ లో కోట్లు ఖర్చు పెట్టి యాడ్ వేయించిన ముఖ్యమంత్రి జగన్... చివరకు కరోనా పేషెంట్లను కూడా పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. ఈ క్రమంలో నిబంధనలు తుంగలో తొక్కి రోగుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. తాజాగా రాజమండ్రి యువకుడు ఒకరు కరోనా నుంచి కోలుకు డిశ్చార్జి అయితే అతని ఫొటో ఆన్లైన్లో పెట్టారు. ఇదే తప్పు అనుకుంటే. అందరకీ కేంద్రం నెత్తీనోరు మొత్తుకుని సామాజిక దూరం పాటించమంటే... డాక్టర్లు, సిబ్బంది, గవర్నమెంటు అధికారులు పబ్లిసిటీ పిచ్చికోసం గుంపుగుంపులగా కరోనా జయించిన రోగికి వీడ్కోలు పలికారు. పక్కపక్కనే ఉంటూ భుజాలు చరిచారు. ప్రపంచ వ్యాప్తంగా షేక్ హ్యాండ్ ని ప్రస్తుతం నిషేధించారు. కరోనా రోగితో ఏకంగా డాక్టర్లు, ప్రభుత్వం అధికారులే షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంజ్జ. 

దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోలుకున్నారు. కానీ ఏ రాష్ట్రంలోను ఇలా పండగ చేయలేదు. కానీ జగనన్న టీం మాత్రం... కరోనాను పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమేసినట్టు సంబరాలు చేసుకుంటూ జనాల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ ఫొటోలు చూస్తే వారు చేసిన తప్పు కరెక్టుగా అర్థమవుతుంది.