‘‘ఆందోళనొద్దు, అమరావతి చట్టం చెల్లదు‘‘

August 10, 2020

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి  జగన్ విధానంపై ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరం.. ఇది రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. 

మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి, రాష్ట్రపతి ఆర్డర్ కు పూర్తిగా వ్యతిరేకం ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుంది కానీ, ఆ చట్టాలు హైకోర్టులో నిలబడవు -  కాబట్టి మూడు రాజధానులకు ఆమోదముద్ర పడిందనే భ్రమల్లో ఉండేవారు భ్రమలన్నీ పటాపంచలు అవుతాయన్నారు. 

ఇల్లు అలకగానే పండుగ కాదని... 2014లో అసెంబ్లీ సాక్షిగా ఏపీ రాజధానిగా అమరావతిని జగన్ స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు తులసిరెడ్డి. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి... అపుడు అమరావతికి ప్రజల మద్దతు ఉందో లేదో తెలుస్తుంది. ఇపుడు జగన్ ఫీట్లు తాత్కాలికమే. రాజ్యాంగమే అత్యున్నతమైనది. న్యాయస్థానాల్లో అమరావతి సాధనకు మార్గం ఉందని తులసిరెడ్డి అన్నారు.

హైకోర్టును మార్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు గుర్తుంచుకోవాలి  అయన ప్రస్తావించారు.