జగన్ ఇలా చేస్తాడని మీరు ఊహించి ఉండరు

June 03, 2020

మంచి చెడుతో సంబంధం లేదు

చంద్రబాబు పెట్టాడు అన్న ఒకే ఒక కారణంతో జగన్ ఏదైనా తీసేస్తాడు

గత ప్రభుత్వం సీఎం కాన్ఫరెన్స్ హాల్లో ఒక బ్యాగ్రౌండ్ డిజైన్ చేయించింది. అయితే.. నిన్నటి వరకు అదే ఉంది. మరి ఏమనుకున్నాడో ఏమో... పొద్దునకల్లా ఆ డిజైన్ అవుట్. అది పాడు కాలేదు. పోనీ చండాలంగా కూడా లేదు. అసలే సర్కారుకు డబ్బుల్లేక కిందా మీద పడుతుంటే పనికిరాని, రూపాయి ఆదాయం రాని అంశాలపై జగన్ ఖర్చుులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. 

తాజాగా సీఎం కాన్ఫరెన్స్ హాల్లోని పెద్ద బంగారు వర్ణపు బౌద్ద చక్రం తీయించారు జగన్. దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో పెట్టించారు. ఇందులో తప్పేమీ లేదు గాని.. ఇపుడు ఎందుకు ఈ అనవసరమైన ఖర్చు. ఆర్థికంగా రాష్ట్రం కుదేలైన నేపథ్యంలో పావలా కూడా పనికొచ్చేదానిపై పెడితే బాగుంటుందిగా !