​వారిని మళ్లీ ఏడిపించిన ఏపీ సర్కారు

August 06, 2020

అబ్బ ఈ చంద్రబాబు ఎపుడు దిగిపోతాడా? జగన్ వస్తే  మన పని గురించి అడిగేవాడే ఉండడు... అనుకుని దగ్గరుండి జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించారు అని ఆరోపణలు వినిపిస్తుంటాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని... అది కనుక నిజమైతే ... ఇపుడు వాళ్లు జగన్ శత్రువులుగా మారిఉంటారు. ఏపీలో పరిస్థితి అలాగే ఉంది.

వరుసగా రెండు నెలలు సగం జీతం తీసుకున్న చరిత్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎపుడూ లేదు. తొలిసారి జగన్ హయాంలోనే ఇది జరిగింది. మనందరికీ వారి జీతాలు కోత పడటమే కనిపిస్తోంది. కానీ ఇంకో విషయం గమనించాలి. అవినీతి పరులు అందరికీ లంచాలను కూడా కరోనా బంద్ చేసింది. దీంతో సగం జీతం తప్ప చిల్లిగవ్వ ఆదాయం లేక ఏపీలో ఉద్యోగవర్గం విలవిల్లాడిపతోోంది. ఫిబ్రవరిలో పన్ను కోత, మార్చి, ఏప్రిల్లో కరోనా జీతం కోత... మే పరిస్థితిపై కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వారు బాధ వర్ణనాతీతంగా ఉంది. నిజం చెప్పాలంటే వరుసగా మూడు నెలలు ప్రభుత్వ ఉద్యోగుల చేతికి సగం జీతమే వచ్చింది.

తాజాగా ఈరోజు ఏప్రిల్ నెలకు సంబంధించి మే 1 న ఇచ్చే జీతాల్లోను సగం కోత విధిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. సీఎస్ నీలంసహానీ పేరు మీద ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే... ఈసారి పింఛనుదారుల జీతాన్ని కోయడం లేదు. అయితే.. ఇతర ఉద్యోగులకు మరింత మండేలా సచివాలయ ఉద్యోగులకు వంద శాతం జీతం ఇవ్వడం విశేషం. వైద్యులకు, పోలీసులకు, మున్సిపల్ వారికి ఇస్తే ఓకే గాని.. సచివాలయ ఉద్యోగులకు ఎందుకు ఫుల్ జీతం ఇచ్చి మాకెందుకు కోస్తున్నారు అని ఉద్యోగులు రగిలిపోతున్నారు.