జగన్ పై పవన్ విజయం

March 28, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జనసేన అధినేత పోరాటం గెలిచింది.  పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుుని గత కొన్ని నెలలుగా వదలకుండా పోరాటం చేశారు.  ఇది ఆత్మహత్య కాదని, హత్య అని... తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనవ్ కళ్యాణ్  జగన్ దిశ చట్టం తెచ్చాక... ఒక ఆడపిల్లకు న్యాయం చేయనపుడు మీ దిశ చట్టం ఎందుకు అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఇదే విషయమై క్రమంగా పోరాడుతూ వచ్చారు. పవన్ పోరాటం ఫలించింది. పవన్ మాట జగన్ వినక తప్పలేదు.

కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ ద్వారా సీఎంవోకు తెప్పించుకున్న జగన్... ఆ కేసును సీబీఐకి అప్పగించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఆదేశాలతో ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కూడా ఈ కేసు పూర్వాపరాలు తేల్చడానికి ఆసక్తి చూపుతోంది. విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరానికి గురిచేస్తున్నాయి. పదో తరగతి చదువుతున్న ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులకు కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో జైలు తప్పదన్న వాదన వినిపిస్తోంది.