జనంలో అనుమానానికి ప్ర‌భుత్వం వద్ద సమాధానం లేదు

February 21, 2020

ఏపీ సీఎంగా జ‌గ‌న్  త‌న‌పాల‌న కాలంలో అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. దిశ వంటి కీల‌క‌మైన చ‌ట్టాలు తెచ్చారు. అయితే, వీటికి రాష్ట్రంలోని 90% మంది ప్ర‌జ‌లు జైకొట్టారు. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యా ల‌ను కూడా స్వాగ‌తించారు. అయితే, అదేస‌మ‌యంలో తాజాగా జ‌గ‌న్ చేసిన అత్యంత సంచ‌ల‌న‌మైన ప్ర‌క‌ట‌న మూడు రాజ‌ధానుల విష‌యంపై మాత్రం స‌మాజంలోని స‌గానికి పైగా మంది ప్ర‌జ‌లు మౌనంగా ఉండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

నిజానికి పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు ఇస్తామ‌ని చెప్పిన త‌ర్వాత కూడా అక్క‌డ జోష్ క‌నిపించ‌లేదు. పైగా అమ‌రావ‌తి ఉంటుందో.. ? ఉండ‌దో? అస‌లేమ‌వుతుందో? అనే సందేహాలు ముసురుకున్నాయి. ఈ క్రమంలోనే అస‌లు జ‌గ‌న్ చెబుతున్న అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ ఈ పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో సాధ్య‌మేనా? అనే కీల‌క ప్ర‌శ్న‌ను ప్ర‌జ‌లు సంధిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు, పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు తేడా తెలుస్తోం దా?  రెండు మూడు హెచ్‌వోడీల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏ ప్రాంత‌మైన అభివృద్ధి అయిపోయిన‌ట్టేనా ? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అదే స‌మ‌యంలో క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధానిని త‌ర‌లిస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌, హైకోర్టును క‌ర్నూలులో ఏర్పాటు చేస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌పై నా సీమ‌లోనూ ఉత్సాహం లేదు. పైగా హైకోర్టు ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం ? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. రెండు జిరా క్స్ సెంట‌ర్లు, రెండు టీ కొట్లు రావ‌డం త‌ప్ప‌మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అభివృద్ధి ఎలా సాధ్య‌మో సీఎం చెప్పాలి? అంటూ ఇక్క‌డి ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఇక‌, పాల‌నా రాజ‌ధానిని విశాఖ‌కు ఇస్తామ‌ని చెబుతు న్నా.. అక్క‌డి ప్ర‌జ‌లు కూడా పెద్ద‌గా రియాక్ట్ కాక‌పోగా.. వారు కూడా కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

ఇప్ప‌టి కే విశాఖ వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల రాక‌తో.. అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చెందింద‌ని, ప్ర‌త్యేకంగా ఇప్పుడు అభివృద్ధి చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని వారు పెద‌వి విరుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ప్ర‌శ్న‌లే మిగులుతున్నాయి త‌ప్ప‌.. ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా హ‌ర్షం క‌నిపించ‌డం లేద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.