​జగన్ సర్కారు అంత పనిచేస్తోంది... పట్టేసిన బాబు

June 01, 2020

మొదట్నుంచి ఏపీలో కరోనా లెక్కలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా వారి బండారాన్ని బయటపెట్టారు. అసలు కేసుల విషయంలో ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలు ఆడుతోందో అర్థం కావడం లేదని... వీరి నిర్లక్ష్యం వల్ల ఏపీ కరోనాకి బలి అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన చెందారు. ఇప్పటికే పలు రిపోర్టులు తప్పు అని అనుమానాలున్నాయని చెప్పిన చంద్రబాబు తాజాగా ప్రభుత్వం చేసిన ఒక మాయను కూడా బయటపెట్టారు. 

సీఎం డ్యాష్ బోర్డు అంకెలు - ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లెక్కలకు పొంతన లేదని చెప్పారు. మొన్న సాయంత్రం 11613 నమూలు పరీక్షించాం అని చెప్పారు. కానీ మరుసటి రోజు ఆ సంఖ్యను 20 వేల పైచిలుకుకు పెంచేశారు. అసలు దేశంలో ఇప్పటివరకు  ఒక్క రోజు గరిష్ట టెస్టుల సంఖ్యే 30 వేలు దాటకపోతే... ఏపీ 9 వేల టెస్టులు కేవలం 12 గంటల్లో ఎలా చేసిందని ప్రశ్నించారు. ఇది కేవలం తప్పుడు లెక్క అని మాయ అని చంద్రబాబు దుయ్యబట్టారు. పోనీ దక్షిణ కొరియా నుంచి కేంద్రం తెప్పించిన కిట్లు ద్వారా చేశానుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ లెక్కలు ఆ కిట్లు రాక మునుపటివి అని చంద్రబాబు వెల్లడించారు.

పేదల ప్రాణాలతో ఆడుకోవద్దని, తప్పుడు లెక్కలు నమోదు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇది మీ రాజకీయాలకు సమయం కాదని... ప్రజల కోసం సమర్థంగా, మనస్ఫూర్తిగా పనిచేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఇక నుంచి అయినా హెల్త్ బులిటెన్లో సరైన లెక్కలు వెల్లడించాలని బాబు సూచించారు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలు కేసుల విషయంలో గుట్టుగా ఉంటున్నాయి. అదే ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర కేసుల వివరాలు, టెస్టుల వివరాలు అన్నీ రెండు పేజీల్లో ప్రతి రోజు సమగ్రంగా బయటకు వెల్లడిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే అంకెలను గోప్యంగా ఉంచుతున్నాయి. చంద్రబాబుకే కాదు ఏపీ నివారణ చర్యలపై ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నాయి. 

కింద లింకులో తమిళనాడు ప్రభుత్వం ప్రతి రోజు ఎంత క్లియర్ గా కరోనా కేసుల అప్ డేట్ ఇస్తుందో చూడొచ్చు. దాపరికం లేకపోతే... ఏపీ ప్రభుత్వం కూడా ఇలాగే రిపోర్టు ఇచ్చేది. కానీ ఎందుకు ఇలా ఇవ్వడం లేదు. కింది లింకు క్లిక్ చేయండి...

https://stopcorona.tn.gov.in/wp-content/uploads/2020/03/Media-Bulletin-17.04.2020.pdf