జగన్ రంగుల కల కరిగిపోయిన విధంబెట్టిదనిన

August 14, 2020

ఏపీలో అధికారంలోకి రాగానే కనపడిన ప్రతిచోటా వైకాపా రంగులు వేశారు.

చట్టం ప్రకారం ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయకూడదు

దీంతో కొందరు కోర్టు కు వెళ్లారు. 

కోర్టు రంగులు తీసేయ్ అని చెప్పింది

దీంతో ఏపీ సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లింది...

హైకోర్టులోనే తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పింది

మాకు టైం కావాలని ఏపీ సర్కారు చెప్పింది

సరే టైం తీసుకో కానీ అంతవరకు ఎన్నికలు ఆపు అంది కోర్టు

కోర్టు వేసిన పంచ్ కి మైండ్ బ్లాక్ అయ్యింది

చివరకు కోర్టు ఆదేశాలకు మేరకు ఒప్పుకున్నట్లే ఒప్పుకుని మాయ చేయబోయారు

వైకాపా రంగులకు, బీజేపీ రంగు కూడా కలిపి వేశారు.

మళ్లీ కోర్టు వెళ్లింది వ్యవహారం

కోర్టు జీవోను చించి పారేసినంత పనిచేసింది

దీంతో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కారు

బుద్ధుందా మీకు... 3 వారాల్లోపు రంగులు మార్చకపోతే కోర్టు దిక్కార నేరంగా విచారిస్తాం అంది

సైలెంటుగా అన్నిటికి తెల్లరంగులు వేశారు.

తాజాగా జీవో కూడా విడులైంది.

ఖేల్ ఖతం దుకాణ్ బంద్ !

అనగనగా ఒక రంగుల కల కరిగిపోయింది.