జగన్ పెట్టడు...ఎవరినీ పెట్టనివ్వడు

June 03, 2020

అమ్మ పెట్టదు....అడుక్కుతిననివ్వదు అన్నది పాత సామెత....జగన్ అన్నం పెట్టడు..పెట్టేవారిని పెట్టనివ్వడు అన్నది కొత్త సామెత. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ ల ద్వారా  5 రూపాయలకే అన్నం పెట్టారు మాజీ సీఎం చంద్రబాబు. అయితే, జగన్ సీఎం అయిన వెంటనే అన్న క్యాంటీన్ లను తీసేశారు. అడ్డగోలు కారణాలతో పేదవారి కడుపుకొట్టారు జగన్. ఎన్ని విమర్శలు వచ్చినా సరే...క్యాంటీన్ లను మూసివేశారు. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు...విరాళాలు సేకరించి స్వచ్ఛందంగా అన్న క్యాంటీన్ ను నడుపుతున్నారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు దానిని అర్ధరాత్రి అమానుషంగా తొలగించే ప్రయత్నం చేశారు. దీనికి నిరసనగా పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు నడి రోడ్డు మీద పడుకుని తన నిరసన తెలిపారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న క్యాంటీన్ లు పెడతామంటూ అన్న క్యాంటీన్లను మూసివేయించారు. రాజన్న క్యాంటీన్లు వచ్చే వరకు అన్న క్యాంటీన్ లు ఉంచాలని ప్రతిపక్షం కోరినా పట్టించుకోలేదు. 5 రూపాయలకే తమ అన్నార్తిని తీర్చే అన్న క్యాంటీన్ లేకపోయే సరికి నిరుపేదలు, అనాధలు, వ‌ృద్ధులు, దినసరి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి బాధలు చూసి చలించిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు...విరాళాలు సేకరించి  అన్న క్యాంటీన్ ద్వారా పేదల కడుపునింపుతున్నారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు..ఆ క్యాంటీన్ ను తొలగించాలని అర్థరాత్రి ప్రయత్నించారు. దీనికి నిరసనగా రామానాయుడు రోడ్డుపై పడుకొని ఆందోళన చేపట్టారు. రాజన్న క్యాంటీన్లు పెట్టక...అన్న క్యాంటీన్ లో అన్నంపెడుతున్న వారిని అడ్డుకొని....జగన్ నియంతలా మారారని విమర్శలు వస్తున్నాయి. జగన్ పెట్టడు...ఎవరినీ పెట్టనివ్వడు అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.