నిమ్మగడ్డ కేసులో భారీ ట్విస్ట్ ... ఏపీకి పెద్ద షాక్ తగిలే ఛాన్స్

August 07, 2020

ఈ వార్తను ఎలా వివరించాలో అన్నది ఒక మదనం

దీనిని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇంకొక మదనం

ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సంఘటన జరగలేదు. 

ఇదే మొదటి సారి జరగడం.

అందుకే మొత్తం విషయాన్ని సింపుల్ గా చెప్పుకుంటే కరెక్టుగా అర్థమవుతుంది.

 

నిమ్మగడ్డ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డి నెన్స్ తెచ్చింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లారు. 

కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదనతో ఏకీభవించింది. ఆర్డినెన్సు కొట్టేసింది.

దీని అర్థమేంటి... కొత్త నియామకం చెల్లుబాటు కానపుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ ఈ సీ అని టెక్నికల్ కోర్టు చెప్పింది.

===

దీనిపై స్టే ఇవ్వమని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది

సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కుదరదు అని చెప్పింది.

మళ్లీ రాజ్యాంగ బద్ధ పదవి ఖాళీ ఉంచకూడదు స్టే ఇవ్వమని కోరింది

ఖాళీగా ఎక్కుడుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారుగా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

===

సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినా రమేష్ కుమార్ కు ఆ పదవిలోకి ఏపీ సర్కారు ఆహ్వానించలేదు

అంటే స్పష్టంగా, ఉద్దేశపపూర్వకంగా తనను కోర్టు ధిక్కరణ జరుగుతోందని నిమ్మగడ్డ భావించారు.

===

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు.

ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని చెప్పారు. 

హైకోర్టు సీరియస్ అయ్యింది. మీరు వెళ్లి గవర్నరును కలవండి మేం చూసుకుంటాం అని చెప్పింది.

ఏపీ సర్కారుకు కౌంటరు దాఖలు చేయమని రాబోయే శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.

====

ఇపుడు వైసీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.

తనంతట తాను తెలిసి... ఎరుకతోనే కోర్టు దిక్కరణకు పాల్పడింది.

పైన రాసిన వరుస సంఘటనలను బట్టి ఇది అందరికీ అర్థమైంది.

చివరకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వడంతో మళ్లీ సుప్రీంకోర్టులో అర్జెంటుగా పిటిషను వేసింది

ఏమని...

కోర్టు ధిక్కరణ పిటిషను తీర్పుపై స్టే ఇవ్వాలంటూ అందులో కోరింది.

నిజానికి ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థలోనే భాగం.

పైగా కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే హైకోర్టుపై స్టే నిరాకరించినందున రేపు ఏపీ సర్కారు కోరినట్టు స్టే వచ్చే అవకాశాలు తక్కువ.

కోర్టును ధిక్కరించి, ధిక్కరించిన తీర్పును ఆపమని కోర్టుకు వెళ్లడం అంటే న్యాయవ్యవస్థకే ఒక సవాల్ విసరడం అన్నమాట. ఇందులో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి అరుదైన పిటిషను ఇంతవరకు ఎవరూ వేయలేదు. అసలు వైసీపీ సర్కారు ఇలాంటి ఆలోచన చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

చట్టాల లోని వెసులుబాటుతో గెలవాలనుకునే ప్రయత్నం ఇది.

మరి రేపు సుప్రీంకోర్టు ఏమంటుంది?

గవర్నర్ నుంచి నిమ్మగడ్డకు ఎలాంటి మద్దతు లభిస్తుంది ?

సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తారా ? 

ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు.