ఊహించని నిర్ణయం తీసుకున్న జగన్

June 03, 2020

ప్రతిపక్షాలకు అంతుచిక్కని నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక మార్క్ ఉంది. అయితే... ఆయన నిర్ణయాలు ప్రభుత్వ పరిధులకు లోబడి ఉండేవి. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టినా.. అది రాజకీయం వరకే ఉండేది. కేసీఆర్ నిర్ణయాల్లో కుట్ర తక్కువ, రాజకీయం ఎక్కువ. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా కేసీఆర్ బాటలో నడుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే... అవి నిరంతరం ఒక పార్టీని, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నట్లే ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన నిర్ణయాల్లో రాజకీయం తక్కువ... కుట్ర ఎక్కువ. 

తాజాగా ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. మొదటి రోజే ముఖ్యమంత్రి... నో నోటు, నో మందు అంటూ కబుర్లు చెప్పారు. తాజాగా అసలు మద్యం అస్సలు పంచొద్దు... వచ్చే 12వ తేదీ నుంచి మద్యం షాపులు బంద్ చేస్తున్నాం. ఎన్నికలు ముగిసేవరకు అంటే మార్చి 29వరకు వాటిని తెరవం అంటూ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు స్వయంగా ఏపీ మంత్రి అనిల్ మీడియాతో ప్రకటించారు. దీంతో ఏపీలో ఈ నిర్ణయం కలకలం రేపింది. 

ఇదంతా బానే ఉంది గాని... ఇలాంటి నిర్ణయాలు చేసే ముందు పార్టీని సరిదిద్దుకోవాలి జగన్. వైసీపీ క్యాడర్ కు ముందు నీతులు చెప్పాల్సింది. ఒకవైపు సీఎం జగన్ సీట్లో కూర్చుని మద్య నిషేధ ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఆయన పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ను లెక్క చేయకుండా ఆడోళ్లకు చీరలు, మగోళ్లకు మద్యం పంచి పెట్టారు. అంటే పెద్ద ఎత్తున స్టాక్ దాచుకుని ప్రతిపక్షాలకు మందు దొరకకుండా చేయాలనే ఆలోచన తప్ప... ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నట్లు లేదు ఇది. ఒక్క వైసీపీ నేత కూడా మద్యం పంచకపోతే అపుడు జగన్ చెప్పింది నమ్మొచ్చు. కానీ అది జరగదు. దీనిని ఘంటాపథంగా చెప్పొచ్చు. సాక్ష్యాల కోసం కొద్దిరోజులు వెయిట్ చేస్తే సోషల్ మీడియాలోనే బోలెడన్ని దొరుకుతాయి.