అది జరిగితే జగన్ సర్కారు కూలిపోతుంది

May 26, 2020
CTYPE html>
ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ కాదు బాధ్యత ఉండాలి. ప్రజలను సంతోషపెట్టి చప్పట్లు కొట్టించడం కాదు... వారు అంచనా వేయలేని విధంగా నిర్ణయాలు తీసుకుని వారికి మంచి భవిష్యత్తును అందివ్వాలి. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ఒక్క పని చేయడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచన విధానం... చాలా సింపుల్ గా ఉంది. ప్రభుత్వం నుంచి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి పార్టీకి ఏవిధంగా లాభం చేకూరుస్తుందో చూడటం. తన వర్గానికి అన్ని ప్రయోజనాలు అంది, తన వర్గం కంపెనీలు పెట్టాలనుకుంటే అవి ఠకఠకా జరిగిపోవడం, ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు... చంద్రబాబుకు పేరు తెచ్చే కంపెనీలను వెళ్లగొట్టడం... ఇదీ ముఖ్యమంత్రి జగన్ పాలసీగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇవన్నీ ఒకెత్తు అయితే...  తాజాగా కియా కంపెనీ తరలింపుపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ ఈ వార్తను ఎక్స్ క్లూజివ్ సమాచారం కింద ముద్రించడంతో ఇది పెద్ద సంచలనం అయ్యింది. అందరూ కియా వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నమ్ముతున్నారు. దీనికి బలమైన కారణం కియా కంపెనీపై మొదట్నుంచి వైసీపీ వ్యవహరిస్తున్న తీరే. 
కంపెనీ అంతా రెడీ అయ్యాక కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కియాను భయపెట్టినంత పనిచేశారు. ధర్నాలు చేశారు. అధికారంలోకి వచ్చాక... ఒక ఎంపీ స్థాయి వ్యక్తి... ప్రపంచంలోని పలు దేశాల ప్రధానులు గౌరవించే కంపెనీ ప్రతినిధులను వేదిక మీద తిట్టడం, తెలివితేటలతో సంబంధం లేకుండా మా వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టడం వంటివి, పైగా గవర్నమెంటు ఏకంగా చట్టం కూడా తేవడం ఆ కంపెనీని బాగా ఇబ్బంది పెడుతోంది. మాకెందుకీ కర్మ అని కంపెనీ యాజమాన్యం బాధపడే స్థాయికి ఈ వేధింపులు చేరాయి. ఇక కంపెనీలో చిన్నచిన్న లోకల్ కాంట్రాక్టుల కోసం ప్రతిరోజు పంచాయతీలు పెరిగి కంపెనీ ప్రతినిధులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. 
కియాకు సహకార లోపం, లోకల్ ఉద్యోగ చట్టం, వేధింపులు మధ్య ఎందుకు మాకీ తలనొప్పులు అని కియా భావించే స్థాయికి చేరింది పరిస్థితి. దీనివల్ల కంపెనీ తరలిస్తే ఎలా ఉంటుందన్న చర్చలు ఇంటర్నల్ గా జరుగుతుండవచ్చు. తరలింపు వల్ల కలిగే నష్టం ఇంకో రాష్ట్రంలో ఇంకో విధంగా పూడ్చుకునే అవకాశాలుంటే కచ్చితంగా తరలింపే బెటరని కంపెనీ ఆ దిశగా ఆలోచిస్తుండవచ్చు. వైసీపీ వ్యవహార శైలి... బాగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీనే తరలించాలి అనేంత ఇబ్బందికరంగా ఉంది అంటే... ఇక ఏపీకి కంపెనీలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు ఎలా సృష్టించడుతాయి. ఏపీ ఎకానమీ ఏం కావాలి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? 
ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే... ప్రతిపక్షాలు తడిగుడ్డ వేసుకుని కూర్చున్నా కూడా ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే... కియా కనుక ఇక్కడి నుంచి వెళ్లిపోతే... ఆ రోజే వైసీపీ పతనానికి నాందిగా మారుతుంది. ఇది తథ్యం. 
కొసమెరుపు ఏంటంటే... తమిళనాడులో పెట్టాలని కియా ఆసక్తి చూపిస్తుంది అని ఒకవైపు వార్తలు వస్తుంటే... పంజాబ్ ప్రభుత్వం ఏకంగా... రా కియా... రారా కియా ఇన్వైట్ చేసింది. మేము జగన్ లాగా మా వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని మీపై ఒత్తిడి తీసుకురాం, అలాంటి చట్టాలు మా దగ్గరేం లేవు జగన్ కి నేరుగా పంచ్ వేసింది