బాబు టెక్నాలజీకి రుణపడ్డాం - ఒడిసా సీఎం

July 04, 2020

ఏపీలో 200 కోట్లు ఇచ్చి మరీ చంద్రబాబు మీద విజిబుల్ నెగెటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయడంలో ఒక విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ అనే మాజీ మోడీ సలహాదారును తెచ్చి భారీ ఆఫీసు పెట్టి... పేటీ ఎం ఆఫర్లు పెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాను వైసీపీ మానేజ్ చేయగలిగింది. దీన్ని గుర్తించడంలో కొంతవరకు తెలుగుదేశం పార్టీ ఫెయిలయ్యిందనే చెప్పాలి. జగన్ ను చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గాని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు మొదట్లో. అయితే వైసీపీ చాప కింద నీరులా సోషల్ మీడియాను ఆక్రమించింది. చివర్లో తెలుగుదేశం వారిని మించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినా... అప్పటికే వైసీపీ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ నెగెటివిటీ జనంలోకి వెళ్లిపోయింది.
ఇది ఎంత బలంగా వెళ్లిందంటే... చరిత్రలో రాయలసీమకు గత 60 ఏళ్లలో ఎన్నడూ జరగనంత న్యాయం జరిగింది. కంపెనీల విషయంలో గాని, విద్యా సంస్థల విషయంలో గాని, కొత్త పెట్టుబడుల విషయంలో గాని అన్నింటికీ మించి నీటి పారుదల విషయంలో 5 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో సీమకు సాగు నీరు ఇచ్చారు చంద్రబాబు.
అయినా... రాయలసీమలో ఆశించినంత మేర టీడీపీ పుంజుకోలేదు. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే పుంజుకుంది.
కానీ... చంద్రబాబు తన పాత టెర్ముతో పోల్చుకుంటే సంక్షేమంలో గాని, అభివృద్ధిలో గాని బ్రహ్మాండమైన స్కీములు ప్రవేశపెట్టారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పేదలను బాగా చూసుకుంటూనే తనకిష్టమైన టెక్నాలజీ రంగాన్ని విడనాడలేదు. చంద్రబాబు సృష్టించిన ఆర్టీజీఎస్ టెక్నాలజీని ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు చూసి అబ్బురపోయారు. వారిలో బిల్ గేట్స్, అంబానీ కూడా ఉన్నారు. చంద్రబాబు ఆర్టీజీఎస్ టెక్నాలజీ చూశాక రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ బడి పిల్లల సంఖ్య పెంచే విషయంలో AI వాడుతూ ఒక సాఫ్ట్ వేర్ డెవలప్ చేసింది. ఇలా AI ని వాడుతున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. చంద్రబాబు సృష్టించిన ఆర్టీజీఎస్ పవర్ ఏంటో పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ కు ఫొని తుపానుతో అర్థమైంది.
‘ఫణి’ తుపాన్ కు సంబంధించి తమకు అద్భుత సమాచారం అందించిన ఆర్టీజీఎస్ కు కృతజ్ఞతలు. ఆర్టీజీఎస్ అంచనాలు నిజమయ్యాయి. వారిచ్చిన సమాచారం సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడింది. ‘ఫొని’ తుపాన్ పై ఆర్టీజీఎస్ నిరంతరం సమాచారాన్ని అందించింది.
- నవీన్ పట్నాయక్, ఒడిసా సీఎం.

ఇంతకుమించి బాబు పాలనకు ఏం ఉదాహరణ కాావాలి? ఎంత చేసినా ఏం చేయలేదు అనే కోణంలో జనాల్ని నమ్మించిడానికి వైసీపీ విశ్వప్రయత్నం చేసింది. మరి జనం జగన్ బ్యాచ్ ప్రచారాన్ని నమ్మారో లేదో మే 23న తెలుస్తుంది. అంతవరకు వెయిట్ అండ్ సీ.